Jeevitha Rajasekhar | చిరంజీవిపై విమర్శలు.. జీవిత, రాజశేఖర్‌కు రెండేండ్ల జైలుశిక్ష
Jeevitha Rajasekhar | పరువు నష్టం కేసులో సినీ నటులు డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులకు రెండేండ్ల జైలుశిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ మంగళవారం సంచలన తీర్పు వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై రాజశేఖర్ దంపతులు మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో ఈ కేసు దాఖలు చేశారు.
Jeevitha Rajasekhar | నాంపల్లి కోర్టులు, జూలై 18 (నమస్తే తెలంగాణ): పరువు నష్టం కేసులో సినీ నటులు డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులకు రెండేండ్ల జైలుశిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ మంగళవారం సంచలన తీర్పు వెల్లడించారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై రాజశేఖర్ దంపతులు మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో ఈ కేసు దాఖలు చేశారు. వారి ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సీడీ రూపంలో కోర్టుకు సమర్పించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపి సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు.. రాజశేఖర్, జీవితకు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో వారిద్దరు బెయిల్ బాండ్ల రూపంలో రూ.10 చొప్పున పూచీకత్తులను సమర్పించి కోర్టు నుంచి విడుదలయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

