Devara Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర’ (Devara). జనతా గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీకపూర్ (Janvi kapoor) హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిభాగం 2024 అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చింది.
ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మే 19న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా వదిలారు. ‘ఫియర్ సాంగ్’ (Fear Song) పేరుతో ఈ పాట రిలీజ్ కానుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సాంగ్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేవరలో ఫియర్ సాంగ్ జైలర్లోని ‘హుకుమ్’ సాంగ్‌ను మించేలా ఉంటుందని వంశీ తెలిపాడు. ‘ఎంతగానో ఎదురుచూస్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ అన్న ఫ్యాన్స్‌కు ‘దేవర ఫియర్ సాంగ్’ పర్ఫెక్ట్ పాట. మీ అందరి కంటే ముందు నేను పాట విన్నాను. నన్ను నమ్మండి హుకుమ్ సాంగ్‌ను మర్చిపోతారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ నెక్ట్స్ లెవల్ మాస్. దేవర ముందు నువ్వెంత అంటూ పోస్టర్ షేర్ చేశాడు.
ALL SET for the mighty storm 🌊#DevaraFirstSingle ~ #FearSong will unleash tsunami of madness that will sweep through every coast on May 19th 💥
An @anirudhofficial Musical 🎶 #Devara
Man of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN… pic.twitter.com/mRfxMps4FA— Devara (@DevaraMovie) May 15, 2024
ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు.
#Devara #FearSong .. The perfect anthem for all the fans eagerly awaiting the MAN OF MASSES @tarak9999 anna! 🤩
Me andari kante mundhu nenu paata vinnanu😜Trust me.. Hukum marchipothaaru.. An @anirudhofficial Next level MASS ❤️🔥
Devara Mungita Nuvventha… 🔥🔥 pic.twitter.com/XX8HOWLh8A
— Naga Vamsi (@vamsi84) May 15, 2024