Boat Capsizes | పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియా (Nigeria)లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ పడవ బోల్తా పడింది (Boat Capsizes). ఈ ఘటనలో 40 మంది గల్లంతయ్యారు (40 Missing). వాయువ్య సోకోటో (Sokoto) రాష్ట్రంలోని స్థానిక గోరోన్యో మార్కెట్ (Goronyo Market)కు వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైనట్లు నైజీరియా జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ (NEMA) డైరెక్టర్ జనరల్ జుబైదా ఉమర్‌ను ఊటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రమాద సమయంలో పడవలో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపింది.
ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం నుంచి పది మందిని సురక్షితంగా రక్షించింది. ఈ ఘటనలో 40 మంది గల్లంతయ్యారు. ఓవర్లోడింగ్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానిక అధికారిని ఊటంకిస్తూ నైజీరియాకు చెందిన ది పంచ్ వార్తాపత్రిక పేర్కొంది. గల్లంతైన వారికోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, నైజీరియాలో పడవ ప్రమాదాలు సర్వసాధారణమే.
Also Read..
Donald Trump | యుద్ధాన్ని ఆపాలా? వద్దా? అనేది నీ చేతుల్లోనే ఉంది.. ఆ రెండిటిపై ఆశలు వదులుకో..!
ఉక్రెయిన్ స్నైపర్ ప్రపంచ రికార్డు
సందిగ్ధంలో వాణిజ్య ఒప్పందం.. అమెరికా అధికారుల భారత పర్యటన రద్దు