వాషింగ్టన్ : టారిఫ్ వార్ వేళ భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సందిగ్ధంలో పడింది. వాణిజ్య చర్చల కోసం భారత్ రావాల్సిన అమెరికా బృందం తమ పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
వాస్తవానికి ఆరో విడత చర్చలు ఈ నెల 25-29 తేదీల్లో జరగవలసి ఉంది. ఈ ఒప్పందాన్ని శీతాకాలం వచ్చేనాటికి కుదుర్చుకోవాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. వ్యవసాయం, పాడి పరిశ్రమలలో మార్కెట్లో పెద్ద ఎత్తున ప్రవేశించేందుకు అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తున్నది.