న్యూఢిల్లీ: ఒక ఉక్రెయిన్ స్నైపర్ ఏకంగా 13,000 అడుగుల (దాదాపు 4 కిలోమీటర్లు) దూరం నుంచి గురి తప్పకుండా ఇద్దరు రష్యా సైనికులను కాల్చి చంపి ప్రపంచ రికార్డు సృష్టించాడు. పోక్రొవొస్క్ ప్రాంతంలో ఈ నెల 14న ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది.
ఈ ఆపరేషన్‌లో ఉక్రెయిన్ సైనికుడు స్వదేశంలో తయారైన శక్తిమంతమైన ‘ఎలిగేటర్ 14.5 ఎంఎం’ రైఫిల్‌ను ఉపయోగించాడు. ఈ క్లిష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు అతడికి ఏఐ, డ్రోన్ టెక్నాలజీ సహాయపడినట్టు మిలిటరీ జర్నలిస్ట్ యూరి తెలిపారు.