Donald Trump : శ్వేత సౌధంలో సమావేశానికి ముందే ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) షాకిచ్చాడు. రష్యాతో శాంతి ఒప్పందం (Peace Deal) చేసుకుంటే యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌కు నాటో (NATO) తరహా భద్రతను కల్పించేందుకు సుముఖంగా ఉన్నాయనే వార్తల్ని తోసిపుచ్చారు ట్రంప్. తన ప్రత్యేక రాయబరి స్టీవ్ విట్కోఫ్ ప్రకటించిన కాసేపటికే అమెరికా అధ్యక్షుడు బాంబ్ పేల్చారు.
నాటో సభ్యత్వం, క్రిమియా.. ఈ రెండిటిపై ఆశలు వదిలేసుకోవాలని జెలెన్స్కీకి ట్రంప్ సందేశం పంపారు. అంతేకాదు రష్యాతో యుద్ధాన్ని ఆపాలా? కొనసాగించాలా? అనేది నీ చేతుల్లోనే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడికి.. అమెరికా ప్రెసిడెంట్ తేల్చి చెప్పారు.
US President Donald Trump posts, “President Zelenskyy of Ukraine can end the war with Russia almost immediately, if he wants to, or he can continue to fight. Remember how it started. No getting back Obama given Crimea (12 years ago, without a shot being fired!), and NO GOING INTO… pic.twitter.com/78YpjX8vRZ
— ANI (@ANI) August 18, 2025
‘ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తలచుకుంటే రష్యాతో యుద్ధాన్ని వెంటనే నిలిపివేయవచ్చు. ఒకవేళ ఆయన యుద్ధాన్ని కొనసాగించాలనుకుంటే అదే విధంగా చేయవచ్చు. అయితే.. యుద్ధం ఎలా మొదలైందో ఓసారి గుర్తు చేసుకోవాలి. అంతేకాదు 12 ఏళ్ల క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అప్పగించిన క్రిమియాను ఉక్రెయిన్ దక్కించుకోదు. అలానే నాటో సభ్యత్వంపై కూడా ఆ దేశం ఆశలు వదులుకోవాలి. ఎందుకంటే కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు’ అని ట్రంప్ ట్వీట్లో పేర్కొన్నారు.
మరో ట్వీట్లో వైట్‌హౌస్‌లో సోమవారం పెద్ద సమావేశం జరుగనుంది. యూరోపియన్ దేశాలకు చెందిన పలువురు నాయకులు ఈ భేటీకి హాజరు కానున్నారు. వాళ్లందరికీ ఆతిథ్యం ఇవ్వడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా అని ట్రంప్ వెల్లడించారు.
US President Donald Trump posts, “Big day at the White House tomorrow. Never had so many European Leaders at one time. My great honour to host them!!!” https://t.co/jKCtrMeJnu pic.twitter.com/zT9oZmLMoP
— ANI (@ANI) August 18, 2025