Miss World 2025 | తెలంగాణలో ఆతిథ్యానికి రుణపడి ఉంటానని మిస్ వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్శ్రీ పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని హైదరాబాద్ హైటెక్స్ వేదికగా శనివారం జరిగిన పోటీల్లో థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 72వ మిస్ వరల్డ్ గెలిచిన ఈ థాయ్ సుందరి మాట్లాడుతూ.. ఈ విజయం తనకు ఎంతో సంతోషం కలిగించిందని చెప్పింది. బ్యూటీ విత్ పర్పస్‌ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొంది. తెలంగాణలో సోషల్ సర్వీస్ చేయనున్నట్లు పేర్కొంది. మిస్ వరల్డ్ కిరీటం అందుకునే సమయంలో భావోద్వేగానికి గురయ్యానని.. అదే సమయంలో షాక్‌కు గురయ్యానని చెప్పింది.
Read Also : “Miss World 2025 | మిస్ వరల్డ్ పోటీలలో మెరిసిన చిరంజీవి, రానా, నమ్రత..”
పోటీల్లో తాను మాత్రమే విజేతను కానని.. పోటీదారులంతా తన దృష్టిలో విజేతలేనని చెప్పింది. ఇక్కడ మొదలైన తన ప్రయాణం చాలా అద్భుతమని.. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పింది. తెలంగాణ ప్రజలు గౌరవ ఆతిథ్యం ఇచ్చారని.. వారిని మరిచిపోలేనని చెప్పింది. తెలంగాణ టూరిజాన్ని ప్రమోటం చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పింది. మిస్ వరల్డ్ కావాలన్న తన కల నెరవేరిందని చెప్పింది. హైదరాబాద్ అంటే తనకు ఇష్టమని, తెలంగాణ ఆతిథ్యం బాగుందని చెప్పింది. చౌమహల్లా ప్యాలెస్, పిల్లలమర్రి చాలా బాగున్నాయని.. ఓపల్ ఫర్ హర్ ప్రాజెక్టు కోసం మరింత కృషి చేస్తానని చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా భారీయ చిత్రాలు, నటీనటుల గురించి సైతం థాయ్ సుందరి మాట్లాడింది. భారత్ నుంచి మిస్ వరల్డ్‌గా విజయాన్ని అందుకున్న వారిలో ఎవరంటే ఇష్టం అని మీడియా ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమేనని చెప్పింది. తనకు ఇష్టమైన మానుషి చిల్లర్‌ను ఫైనల్లో కలిశానని.. అలాగే, తనకు ప్రియాంక చోప్రా సైతం ఇష్టమేనని చెప్పింది. ఆమె నుంచే తాను స్ఫూర్తి పొందానని.. తనకు వీలున్న సమయంలో సినిమాలు చూస్తానని తెలిపింది. పలు బాలీవుడ్ సినిమాలు చూస్తానని.. తనకు అలియాభట్ తెలుసునని చెప్పింది. అలియా నటించిన గంగూబాయి కథియావాడి నాకెంతో నచ్చిందని.. అది మూవీ ప్రేక్షకులను ఆలోచింప చేసేలా ఉందని చెప్పింది.
Read Also : “Miss World 2025 | మిస్ వరల్డ్‌గా థాయ్‌లాండ్ సుందరి సుచాత ఓపల్ చువాంగ్శ్రీ”
అయితే, బాహుబలి మూవీ గురించి విన్నానని.. ఆ మూవీ చూడలేదని పేర్కొంది. పోటీలు పూర్తయ్యాక ఆ మూవీని చూడాలని నాకు నేనే ఒట్టు వేసుకున్నానని.. మళ్లీ ఇక్కడికి వచ్చే నాటికి తప్పకుండా ఆ మూవీపై రివ్యూ ఇస్తానని చెప్పింది. అవకాశం వస్తే బాలీవుడ్ సినిమాలో నటిస్తానని.. అదే నాకు ఓ మంచి అవకాశం అవుతుందని చెప్పుకొచ్చింది. మిస్ వరల్డ్ కిరీటం గెలువడం తన జీవితంలో అద్భుతమైన రోజని.. వ్యక్తిగతంగానే కాకుండా థాయ్‌లాండ్ ప్రజలకు మైలురాయిగా అభివర్ణించింది. ఈ విషయంలో తాను గర్వపడుతున్నానని.. మిస్ వరల్డ్ వేదికపై తమ దేశానికి గుర్తింపు లభించిందని పేర్కొంది.