Miss World 2025 | హైదరాబాద్ వేదికగా జరిగిన 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా థాయ్లాండ్ సుందరి సుచాత ఓపల్ చువాంగ్ శ్రీ నిలిచింది. న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో సమాధానం ఇచ్చి మిస్ వరల్డ్ కిరీటాన్ని ఎగరేసుకొని పోయింది. ఇథియోపియా సుందరి హస్సెట్ డెరెజేను వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది. గత మిస్వరల్డ్ చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని అలంకరించింది. విజేతను ప్రకటించగానే సుచాత భావోద్వేగానికి గురైంది. రన్నరప్ మిస్ ఇథియోపియా హాసెట్ డెరెజే, రెండో రన్నరప్.. మిస్ పోలాండ్ మజా క్లాజ్డా, మూడో రన్నరప్.. మిస్ మార్టినిక్ ఆరేలీ జోచిమ్ నిలిచింది. 72వ మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఘనంగా జరిగాయి.
CONGRATULATION/
72 ปีที่รอคอย….
THE NEW MISS WORLD 2025 IS
“THAILAND 🇹🇭”
SUCHATA CHUANGSIRIร้องไห้…..ภูมิใจในตัวโอปอลมาก ๆ
👑1st RUNNER UP: ETHIOPIA
👑2nd RUNNER UP: POLAND
👑3rd RUNNER UP: MARTINIQUE… #MissWorldThailand2025 #MissWorld2025… pic.twitter.com/OyJERZzEv7
— ✨𝐢𝐧𝐬𝐩𝐢𝐫𝐢𝐧𝐠𝐏𝐚𝐠𝐞𝐚𝐧𝐭 (@inspoPageant) May 31, 2025
108 దేశాల అందాల భామలు పోటీల్లో పాల్గొన్నారు. మిస్ వలర్డ్ అమెరికాస్ అండ్ కరేబియన్ టాప్-1లో మార్టినిక్ నిలిచింది. ఆఫ్రికా కాంటినెంట్ నుంచి టాప్-1లో ఇథియోపియా, యూరప్ కాంటినెంట్ నుంచి టాప్-1లో పోలెండ్, ఏషియా అండ్ ఓషియానా నుంచి టాప్-1లో థాయిలాండ్ నిలిచింది. మిస్ ఇండియా నందిని గుప్తా టాప్-8లో చోటు దక్కించుకోలేకపోయింది. పోటీలకు న్యాయనిర్ణేతలుగా మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, నటుడు సోనూ సూద్, హీరో రానా దగ్గుబాటి, తెలంగాణ ఐఎఎస్ అధికారి జయేశ్ రంజన్, మాజీ మిస్ వరల్డ్ మనూషి చిల్లర్, సినీనటి నమ్రత శిరోద్కర్, డోనా వ్యవహరించగా.. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
วินาทีสวมมง#โอปอลสุชาตา #MissWorld2025 #MissWorldThailand2025 #Opalsuchata #MissWorld #OpalForHerOpalForWorld pic.twitter.com/uuKe7sW68M
— 🎀🐰🕊 (@TifFaNy_9member) May 31, 2025