Miss World | థాయ్‌లాండ్ నుంచి తొలి మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన బ్యూటీ సుచాత.. అందమే కాదు.. మనసూ బంగారమే..!
Miss World | హైదరాబాద్ వేదికగా జరిగి మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన సుచాత ఓపల్ చువాంగ్శ్రీ 107 మంది అందగత్తెలను ఓడించి టైటిల్‌ను గెలించింది. 21 సంవత్సరాల వయసులోనే సుచాత ఈ ఘనత సాధించింది. థాయ్‌లాండ్ నుంచి తొలిసారిగా మిస్ వరల్డ్ టైటిల్‌ను సాధించిన బ్యూటీగా నిలిచింది ఓపల్ సుచాత చువాంగ్శ్రీ.
Miss World | హైదరాబాద్ వేదికగా జరిగి మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన సుచాత ఓపల్ చువాంగ్శ్రీ 107 మంది అందగత్తెలను ఓడించి టైటిల్‌ను గెలించింది. 21 సంవత్సరాల వయసులోనే సుచాత ఈ ఘనత సాధించింది. థాయ్‌లాండ్ నుంచి తొలిసారిగా మిస్ వరల్డ్ టైటిల్‌ను సాధించిన బ్యూటీగా నిలిచింది ఓపల్ సుచాత చువాంగ్శ్రీ. 21 సంవత్సరాల వయసులో మిస్ వరల్డ్ 2025 టైటిల్‌ను గెలుచుకుంది. ఓపల్ 20 మార్చి 2003న ఫుకెట్ నగరంలో జన్మించిన సుచత చువాంగ్శ్రీ.. బ్యాంకాక్‌లోని త్రియం ఉదోమ్ సుక్సా పాఠశాలలో చదువుకుంది. థాయ్, ఇంగ్లీష్‌తోపాటు చైనీస్ భాషలోనూ ప్రావీణ్యం ఉన్నది. వివిధ దేశాల సంస్కృతీ, సంప్రదాయాలపై మక్కువ పెంచుకుంది. ప్రస్తుతం థమ్మసాట్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ అభ్యసిస్తున్నది. అంతర్జాతీయ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. అయితే, వ్యాపారవేత్తల కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు మోడలింగ్, అందాల పోటీల్లో ఆసక్తితో.. 2021లో ‘మిస్ రత్తనకోసిన్’ పోటీల ఆడిషన్స్‌లో పాల్గొంది. అయితే, అందులో పాల్గొనేందుకు అవకాశం రాకపోయినా.. అధైర్యపడకుండా ప్రయత్నాలు చేసింది.
2022 సంవత్సరంలో తన 18వ ఏటా ‘మిస్ యూనివర్స్ థాయ్‌లాడ్’ పోటీల్లో పాల్గొని రెండో రన్నరప్‌గా నిలిచింది. 2024లోనూ ‘మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. అలాగే, మిస్ ఛార్మింగ్ టాలెంట్, మిస్ బ్యూటీ అండ్ కాన్ఫిడెన్స్ తదితర సబ్ టైటిల్స్‌ను సైతం గెలుచుకుంది. సుచాత 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రొమ్ములో కణితి ఉన్నట్లు తేలింది. అది క్యాన్సర్ కాదని, ప్రమాదం ఏమీ లేదని తేలడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. భవిష్యత్‌లో క్యాన్సర్‌గా మారకుండా ఉండేందుకు కణితిని తొలగించినా.. క్యాన్సర్‌తో బాధపడే వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న సుచాత మదిలో అప్పుడే మొదలైంది. దాంతో క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలని ‘ఓపల్ ఫర్ హెర్’ అనే ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ వస్తున్నది. తొలి దశలోనే క్యాన్సర్‌ని గుర్తించేలా చేయడం ఈ ప్రాజెక్టు కీలక ఉద్దేశం. బాధితులకు అండగా నిలిచేందుకు నిధులు సేకరించడంతో పాటు పలు సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

