Miss World 2025 | ఎట్టకేలకి మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా ముగిసాయి. దాదాపు ఇరవై రోజులుగా జరుగుతున్న ఈ అందాల పోటీలకి తెరపడింది. ఎవరు మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంటారా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, థాయ్‌లాండ్ భామ కిరీటం అందుకుంది. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు ఈ పోటీల్లో పాల్గొనగా, మిస్ ఇండియా నందిని గుప్తా టాప్-8లో కూడా స్థానం దక్కించుకోలేకపోవడం బాధాకరం. మిస్‌వరల్డ్ విజేతకు 8 కోట్ల 50 లక్షల రూపాయల ప్రైజ్‌మనీని అందించారు. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, సినీ ప్రముఖులు సందడి చేశారు.
ఆ మధ్య అందాల భామల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక డిన్నర్లో నాగార్జున సందడి చేయగా, ఫైనల్స్‌కి మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి హాజరై సందడి చేశారు. ఇక వీరితోపాటు రానా, నమ్రత శిరోద్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టాప్ 8 దశలోనే ఇండియాకి చెందిన నందిని గుప్తా ఎలిమినేట్ కావడంతో భారతీయుల ఆశలు గల్లంతు అయ్యాయి. ఇక ఈ కార్యక్రమంలో సోనూ సూద్‌కి హ్యూమనేటేరియన్ అవార్డుని అందించారు. దీన్ని ఆయన సింగిల్ మదర్స్ కి అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు ఈ పోటీల్లో పాల్గొనగా, థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు.
మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా చేతుల మీదుగా ఆమె మిస్ వరల్డ్ 2025 కిరీటం అందుకున్నారు. ఇప్పుడు ఓపల్ గురించి అందరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2021లో ఓపల్ ‘మిస్ రత్తనకోసిన్’ పోటీల్లో పాల్గొంది. కానీ ఈ పోటీల్లో ఆమె ఎంపిక కాలేదు. అయినప్పటికీ ఓపల్ నిరాశ చెందకుండా మరుసటి ఏడాది 2022లో సుచాత మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీల్లో పాల్గొంది. మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలు ఆమెకి మంచి ఫలితాన్ని ఇచ్చాయి. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు కిరీటం దక్కించుకుంది. అయితే 16 ఏళ్ళ వయసులో జీవితంలో అతిపెద్ద సవాల్ ఎదురైంది.ఓపల్ సుచాత బ్రెస్ట్ క్యాన్సర్ కి గురైంది. ఆ సమయంలో తన చేతుల్లో ఏమి లేదని, మొత్తం కోల్పోయా అనే ఫీలింగ్ తనకి కలిగిందని పేర్కొంది.అయితే అది అంత డేంజర్ కాకపోయిన చాలా ఆందోళన చెందినట్టు ఓపల్ పేర్కొంది.