Khawaja Asif | పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి (Pak defence minister) ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఖైబర్ పఖ్తూంఖ్వా, బలూచిస్థాన్‌లోని ఉగ్రవాదం వెనుక న్యూఢిల్లీ ప్రమేయం ఉందని ఆరోపణలు గుప్పించారు. అదేవిధంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పాక్‌పై భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చని హెచ్చరించారు.
కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఎక్కడైనా, ఏ క్షణమైనా భారత్ సైనిక దాడి చేయొచ్చని ఆయన అన్నారు. ఈ మేరకు తమకు సమాచారం ఉందన్నారు. భారత్ దాడికి తాము కూడా ధీటుగా బదులిస్తామని వ్యాఖ్యానించారు. ‘ఎల్ఓసీ వెంబడి ఏ క్షణానైనా భారత్ సైనిక దాడి చేయొచ్చు. ఇందుకు సంబంధించిన సమాచారం ఉంది. న్యూ ఢిల్లీకి తగిన సమాధానం ఇస్తాం’ అని విలేకరులతో ఆయన అన్నారు.
ఈ సందర్భంగా భారత్, ప్రధాని మోదీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం అణు యుద్ధాన్ని తీసుకొచ్చే పరిస్థితిని భారత ప్రధాని నరేంద్ర మోదీ కల్పిస్తున్నారని ఆరోపించారు. ఖైబర్ పఖ్తూంఖ్వా, బలూచిస్థాన్‌లోని ఉగ్రవాదం వెనుక న్యూఢిల్లీ ప్రమేయం ఉందని ఆసిఫ్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను వీడియోలతో సహా యూఎన్‌కు అందించినట్లు చెప్పారు.
Also Read..
Abdul Basit | మే 10-11 తేదీల్లో పాక్‌పై భారత్ దాడులు.. పాక్ దౌత్యవేత్త సంచలన ట్వీట్
Cyber Attack | భారత్‌పై పాకిస్థానీ హ్యాకర్ల దాడులు.. డిఫెన్స్ వెబ్సైట్లు హ్యాక్
Balvinder Singh Sahni: భారతీయ బిలియనీర్‌కు దుబాయ్‌లో జైలుశిక్ష.. ఎవరీ బల్విందర్ సింగ్ సహ్ని ?