Cyber Attack | న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో పాకిస్థానీ హ్యాకర్లు సోమవారం పలు ఇండియన్ డిఫెన్స్ వెబ్సైట్లపై సైబర్ దాడులు చేశారు. డిఫెన్స్ సిబ్బంది లాగిన్ క్రెడెన్షియల్స్ సహా సున్నితమైన సమాచారం హ్యాక్ అయినట్లు తెలిసింది. పాకిస్థాన్ సైబర్ ఫోర్స్ ఇచ్చిన ఎక్స్ పోస్ట్‌లో భారత మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ల సున్నిత సమాచారాన్ని హ్యాకర్లు పొందినట్లు తెలిపింది. ఈ గ్రూప్ ఆర్మర్డ్ వెహికిల్ నిగమ్ లిమిటెడ్ వెబ్సైట్ రూపురేఖలను మార్చేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. పాకిస్థాన్ సైబర్ ఫోర్స్ ఎక్స్ హ్యాండిల్‌ను మన దేశంలో ప్రభుత్వం నిలిపేసింది.