Mecca | సౌదీ అరేబియా (Saudi Arabia)లోని ముస్లింల పవిత్ర క్షేత్రం మక్కాకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. భూమికి 400 కిలోమీటర్ల దూరంలోని అంతరిక్షం (space) నుంచి తీసిన ఫొటోలో రాత్రి వేళల్లో మక్కాలోని పవిత్ర స్థలం కాబా (Mecca Kaaba) గృహం కాంతులీనుతూ అద్భుతంగా, ఆకర్షణీయంగా కనిపించింది. ఐఎస్ఎస్ (ISS) యాత్ర సందర్భంగా తీసిన ఈ ఫొటోను ప్రముఖ వ్యోమగామి డాన్ పెటిట్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘సౌదీ అరేబియాలోని మక్కా ఆర్బిటల్ వ్యూ ఇది. మధ్యలో వెలుగులీనుతున్నది ఇస్లాం పవిత్ర స్థలం కాబా. స్పేస్ నుంచి కూడా కనిపిస్తోంది’ అని ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్గా మారింది.
Also Read..
F-16 Fighter Jet | కుప్పకూలిన అమెరికా ఎఫ్ 16సీ ఫైటర్ జెట్.. పైలట్ సేఫ్
మీరు యుద్ధాన్ని కోరుకుంటే మేం రెడీ
నేడు భారత్కు పుతిన్.. ప్రధాని నివాసంలో విందు