వాషింగ్టన్: అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు (US Air Force) చెందిన ఫైటర్ జెట్ ఎఫ్-16సీ (F-16 Fighter Jet) ఫైటింగ్ ఫాల్కన్ కుప్పకూలిపోయింది. అయితే పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ట్రోనా ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10.45 గంటలకు యుద్ధవిన్యాసాల ప్రదర్శనల స్క్వాడ్రన్‌గా పలిచే ‘థండర్బర్డ్స్’కు (Thunderbirds) చెందిన ఈ ఫైటర్ జెట్ (F-16C Fighting Flacon) ఒక్కసారిగా కూలిపోయింది (Crashed). విమానం నేలను ఢీకొనగానే భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. అయితే విమానం కుప్పకూలక ముందే పైలట్ ఫైట్ నుంచి బయటపడటంతో ప్రాణహాని తప్పింది. స్వల్ప గాయాలైన పైలట్‌ను అధికారులు రిడ్జెక్రెస్ట్లోని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, తమ స్య్వాడ్రన్కు చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలినట్లు థండర్‌బడ్స్ ధ్రువీకరించింది. బుధవారం ఉదయం 10.45 గంటల సమయంలో ఎఫ్-16సీ ఫైటర్ ఫాల్కన్ కూలినట్టు చెప్పింది. పైలట్‌కు స్వల్ప గాయాలు అయ్యాయని, ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే అమెరికా ఎయిర్ ఫోర్స్ ఈ ప్రాంతంలో యుద్ధవిన్యాసాల శిక్షణ చేపడుతుంది. మొత్తం 6 థండర్‌బడ్స్ జెట్స్ శిక్షణలో ఉండా, ఒకటి కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు.

#WATCH: Moment F-16C fighter jet Falcon from US Air Force crashes near Trona Airport in California.#f16c #fighterjet #planecrash pic.twitter.com/B3NuLrkqye
— U R B A N S E C R E T S 🤫 (@stiwari1510) December 3, 2025