సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 13, 2020 , 13:06:02

ఫ్రెండ్ క‌దా అని కీస్ చేతికిస్తే.. రూ. 2 కోట్లు విలువ చేసే కారును డైరెక్టుగా దానికే గుద్దేశాడు!

ఫ్రెండ్ క‌దా అని కీస్ చేతికిస్తే.. రూ. 2 కోట్లు విలువ చేసే కారును డైరెక్టుగా దానికే గుద్దేశాడు!

మ‌నకి అవ‌స‌ర‌మ‌య్యే వ‌స్తువు ఫ్రెండ్ ద‌గ్గ‌ర ఉంటే మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌ట్లే ఫీల‌వుతుంటాం. ఎందుకంటే అడ‌గ్గానే ఇచ్చేవాడే ఫ్రెండ్‌. కొన్నిసార్లు అడ‌క్కుండా కూడా ఇస్తుంటాడు. మ‌రి అలా ఇచ్చిన‌ప్పుడు ఆ వ‌స్తువును ఎంత జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. మ‌న‌దాని క‌న్నా ఎక్కువ ప్రేమ‌గా చూసుకోవాలా? లేదా.  ఇత‌ను మాత్రం ఇవేం గుర్తుంచుకోకుండా జ‌ల్సాల‌కు పోయాడు. కారు అదుపు త‌ప్ప‌డంతో నుజ్జు నుజ్జ అయిపోయింది. స్పెయిన్‌లోని హ్యూయెల్వా‌కు చెందిన ఓ యువకుడు తన ఫ్రెండ్ కారును జాయ్‌రైడ్ కోసం తీసుకున్నాడు. అతివేగంతో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు అదుపు త‌ప్పి రోడ్డు ప‌క్క‌నే ఉన్న ప‌వ‌ర్ కంట్రోల్ రూమ్ గోడ‌ను గుద్దేశాడు. ఇంకేముందు ఆ కారు ప‌చ్చ‌డి ప‌చ్చ‌డైంది. ఈ విష‌యం ఫ్రెండ్‌కి ఎలా చెప్పాలో అర్థం కాక అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు.

మామూలుగా చెట్టుని గుద్దితేనే పోలీసులు ఊరుకోరు. అలాంటిది ప‌వ‌ర్ కంట్రోల్‌కి సంబంధించిన గోడ‌ను గుద్దితే ఊరుకుంటారా?  కారు నెంబ‌ర్ ఆధారంగా య‌జ‌మానిని ప‌ట్టుకున్నారు. పాపం కారు న‌డిపింది నేను కాదు మొర్రో అని మొత్తుకున్నా వినిపించుకోకుండా అరెస్ట్ చేశారు. ఆ త‌ర్వాత అస‌లు విష‌యం తెలుసుకొని త‌న ఫ్రెండ్‌కు కాల్ చేస్తే యాక్సిడెంట్ కార‌ణంగా బాగా దెబ్బ‌లు త‌గిలాయి. హాస్పిట‌ల్‌లో ఉన్నాను అని మొరాయించాడు. పోలీసులు అత‌నున్న హాస్పిట‌ల్‌కు వెళ్లి బాధితుడిని అరెస్ట్ చేశారు. ఇది సాదా సీదా కారు అయింటే అంత‌గా ప‌ట్టించుకునేవాడు కాదు య‌జ‌మాని. ఇది అత్యంత ఖ‌రీదైన లంబోర్ఘిని కారు. దీని విలువ సుమారు రూ. 2 కోట్లు వ‌ర‌కు ఉంటుంది. అందుకే అంత బాధ‌ప‌డుతున్నాడు. యాక్సిడెంట్ అయిన వెంట‌నే విద్యుత్ స‌ర‌ఫ‌రాను అపేయ‌డంతో ఎవ‌రికీ ఎలాంటి హాని జ‌ర‌గ‌లేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.  logo