సోమవారం 01 జూన్ 2020
International - May 22, 2020 , 02:14:40

‘లాక్‌' ఎత్తేయకుంటే మరిన్ని మరణాలు

‘లాక్‌' ఎత్తేయకుంటే మరిన్ని మరణాలు

వాషింగ్టన్‌: లాక్‌డౌన్‌ ఎత్తివేయకుంటే నిరాశానిస్పృహలతో, ఒంటరితనంతో ప్రజలు మరింతమంది చనిపోతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆందోళన వ్యక్తంచేశారు. లాక్‌డౌన్‌ను సడలించి వ్యాపారాలను పునరుద్ధరించే అంశంపై వివిధ దేశాలు ఆచితూచి స్పందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించిన నేపథ్యంలో  ఆయన ఈ వ్యాఖ్య చేశారు.  కరోనా వైరస్‌ వ్యాప్తితో తమకు సంబంధం లేదని ఓ చైనా అధికారి చేసిన ప్రకటనపై ట్విట్టర్‌ వేదికగా ట్రంప్‌ ప్రతిస్పందిస్తూ ఆ దేశం ‘అసమర్థత’ వల్లే కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా సామూహిక మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. కాగా, వివిధ దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వచ్చేనెలలో జీ-7 సదస్సు నిర్వహించి, చైనాను ఏకాకిని చేయాలని ట్రంప్‌ తలపోస్తున్నారు. 

3.9 కోట్ల ఉద్యోగాలు ఊస్ట్‌ 

  • కరోనా కారణంగా అమెరికాలో రెండు నెలల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు 3.9 కోట్ల మంది.
  • వీరికి అదనంగా.. సొంతగా వ్యాపారం చేసుకుంటున్న మరో 22 లక్షల మంది కూడా నిరుద్యోగ భృతి పొందనున్నారు.
  • ఇవన్నీ కలుపుకొంటే.. కరోనా వల్ల దాదాపు 4.1 కోట్ల మంది వీధిన  పడ్డట్టు అవుతుంది.
  • నిరుద్యోగిత రేటు ఏప్రిల్‌లో 14.7 శాతం ఉండగా.. ఈ నెలలో  20 శాతానికి, జూన్‌లో 25 శాతానికి పెరుగుతుందని అంచనా.


logo