Donald Trump | రెండో సారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత్ సహా పలుదేశాలకు చెందిన వందలాది మంది వలసదారులను (illegal immigrants) ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు సాగనంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అక్రమ వలసదారులకు ట్రంప్ ఒక ఆఫర్ ఇచ్చారు. యూఎస్‌లో అక్రమంగా ఉంటూ స్వీయ బహిష్కరణ చేసుకోవాలనుకునే వారికి విమాన ఖర్చుల (plane tickets)తో పాటు కొంత నగదు కూడా అందిస్తామని ప్రకటించారు.
ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వారిపై ఇమిగ్రేషన్ అధికారులు దృష్టి సారించారు. చట్టవిరుద్ధంగా ఉంటున్న సాధారణ పౌరుల కోసం స్వీయ బహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలా వెళ్లాలనుకునే వారికి మా ప్రభుత్వం అన్నివిధాల సాయం చేస్తుంది. విమాన ఖర్చులతోపాటు కొంత నగదును అందిస్తుంది. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టడమే మా ప్రభుత్వ ప్రథమ లక్ష్యం. వెళ్లిపోయినవారిలో మంచివారు ఉంటే వారిని చట్టపద్ధతిలో వెనక్కి తిరిగి రావడానికి కూడా అనుమతి ఇస్తాం’ అని ట్రంప్ వెల్లడించారు.
Also Read..
Health Tips | బీపీ కంట్రోల్ ఉండాలంటే ఈ పండు రోజుకొక్కటి తింటే చాలు!
Donald Trump | ట్రంప్ సర్కార్‌పై న్యాయ పోరాటానికి దిగిన విద్యార్థులు.. వీసాల రద్దుపై దావా!
China wildfire | ఉత్తర చైనాలో కార్చిచ్చు బీభత్సం.. మంటలార్పుతున్న 3 వేల మంది