Vivek Ramaswamy | అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దూసుకెళ్తున్న వివేక్ రామస్వామి ఎవరు? సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయన ఆస్థాయికి ఎలా ఎదిగారు?
Vivek Ramaswamy | వివేక్ గణపతి రామస్వామి.. అంతర్జాతీయ మీడియాలో హోరెత్తుతున్న పేరు. సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో జనం ఎక్కువగా వెతికిన పేరూ ఇదే. భారతీయ మూలాలున్న వివేక్ అమెరికాలో స్వయంగా ఎదిగిన కుబేరుడు. వచ్చే ఏడాది అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగాలనుకుంటున్న వారిలో తనూ ఒకరు. ఆశావహుల జాబితాలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ తర్వాతి స్థానం మన వివేక్‌దే.
Vivek Ramaswamy | వివేక్ గణపతి రామస్వామి.. అంతర్జాతీయ మీడియాలో హోరెత్తుతున్న పేరు. సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో జనం ఎక్కువగా వెతికిన పేరూ ఇదే. భారతీయ మూలాలున్న వివేక్ అమెరికాలో స్వయంగా ఎదిగిన కుబేరుడు. వచ్చే ఏడాది అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగాలనుకుంటున్న వారిలో తనూ ఒకరు. ఆశావహుల జాబితాలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ తర్వాతి స్థానం మన వివేక్‌దే.
అగ్రరాజ్యం అమెరికాను భారత సంతతి కుబేరుడు 38 ఏండ్ల వివేక్ రామస్వామి కమ్మేశాడు. అమెరికన్ మీడియా అతణ్ని ట్రంప్ 2.0గా పేర్కొంటున్నది. ట్రంప్‌లానే వివేక్ కూడా అన్ని రంగాల్లో అమెరికన్లకు ప్రాధాన్యం దక్కాలనుకునే మొండిమనిషి. కాబట్టే, ట్రంప్ లాంటి వివాదాస్పద వ్యక్తిని ‘21వ శతాబ్ది అత్యుత్తమ అధ్యక్షుడు’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు వివేక్. ఆ పెద్ద మనిషి ‘థాంక్యూ వివేక్’ అని బదులిచ్చాడు కూడా. అక్కడితో ఆగకుండా.. తాను అధ్యక్షుడు కాగానే డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ఫైల్ మీదే తొలి సంతకం పెడతానని అంటున్నాడు వివేక్. ఒకవేళ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మొదటి స్థానంలో నిలిస్తే ఉపాధ్యక్ష స్థానమైనా తనకు దక్కుతుందని వివేక్ అంచనా. అందుకే ప్రచార సభల్లో ట్రంప్‌ను విమర్శించకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడని అమెరికాలో మాజీ భారత రాయబారి మీరా శంకర్ గుర్తుచేశారు.

తెలివైన తెగువరి
వివేక్ తెగువ, ఆత్మవిశ్వాసం గురించి రాస్తూ ‘అద్దం ముందు నిలబడినప్పుడు తన ప్రతిబింబంలో ఆయన తనను తాను అధ్యక్షుడిగా చూసుకుంటాడు’ అని వ్యాఖ్యానించింది లాస్ ఏంజెల్స్ టైమ్స్. తాను గెలిస్తే అధ్యక్షుడి సలహాదారుగా ఎలాన్ మస్క్‌ను నియమించుకుంటానని ప్రకటించాడు వివేక్. కాకపోతే, ట్రంప్‌లా కాకుండా వివేక్ రామస్వామి కష్టపడి సంపాదించిన డబ్బుతోనే అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. కాబట్టే, ‘ఎవ్వరూ కొనని, ఎవ్వరూ విరాళాలు ఇవ్వని ఏకైక అభ్యర్థిని నేనే’ అని ఘంటాపథంగా చెబుతాడు. 2023 ఆగస్టు నాటి ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. బయోటెక్, ఇతర వ్యాపారాల ద్వారా ఆయన కూడబెట్టిన సంపద విలువ 95 కోట్ల అమెరికన్ డాలర్లకు పైమాటే. ఇదంతా రోయివెంట్, యాగ్జోవెంట్, ఇంటపిర్డయిన్ లాంటి సంస్థల ద్వారా సంపాదించింది కావడం గమనార్హం. ఇంత సంపద ఉన్నప్పటికీ వివేక్‌కు ఓహియో రాష్ట్రంలో రెండంటే రెండు ఇండ్లు మాత్రమే ఉన్నాయి. యువ కుడిగా ఉన్నప్పుడు వివేక్ రామస్వామి సంగీతం అంటే ఆసక్తి చూపేవాడు. హార్వర్డ్‌లో జీవశాస్త్రం చదివినా.. టీనేజీలోనే డాలర్ల వేట ప్రారంభించాడు. విద్యార్థులకు ఆర్థిక సదుపాయం కోసం స్టుడెంట్ బిజినెస్.కామ్ అనే స్టార్టప్‌ను స్థాపించాడు. ఇక, సంగీత నైపుణ్యంతో విశ్వవిద్యాలయంలో సెలెబ్రిటీ అయిపోయాడు.
నికార్సయిన భారతీయుడు
నల్లజాతికి చెందిన బరాక్ ఒబామా 2008లో అమెరికా అధ్యక్షుడయ్యాడు. అలా శ్వేతజాతీయులు అధికంగా ఉన్న దేశంలో మొదటి నల్లజాతి వ్యక్తి ఉన్నత స్థానంలో నిల్చున్నాడు. వివేక్ రామస్వామి ఎన్నికైతే.. మొదటి బ్రౌన్ అధ్యక్షుడుగా చరిత్రలో నిలిచిపోతాడు. అవకాశాల స్వర్గం అమెరికాలో ఏదీ అసాధ్యం కాదు. ఎవరైనా అధ్యక్షుడు కావొచ్చు. అయితే క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న దేశంలో ఆయన ఎన్నిక అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. అయినా వివేక్‌కు ఆత్మవిశ్వాసం ఎక్కువ. లక్ష్య సాధన కోసం బాగానే కసరత్తు చేస్తున్నాడు. హిందూమతం క్రైస్తవానికి ముప్పు కాదని ప్రకటించాడు. “ఎంతోమంది క్రైస్తవుల కంటే నేనే బైబిల్ క్షుణ్నంగా చదివాను” అంటాడు. తాను హిందువు అని చెప్పుకోవడానికి గర్విస్తాడు. తరచూ దేవాలయాలను సందర్శిస్తాడు. ఇంట్లో పూజలు, వ్రతాలు చేస్తాడు. వివేక్ భార్య అపూర్వ తమ ఇద్దరు కొడుకులకు హిందూ ధర్మాన్నే పరిచయం చేసింది. అందుకే, భారతీయ అమెరికన్లు వివేక్ పట్ల అంత ఆదరం చూపుతున్నారు. ఎవరికి తెలుసు, ఏడాది కాలంలో ఏమైనా జరగొచ్చు! బ్రిటన్ను ఓ భారతీయ మూలాలున్న వ్యక్తి పాలిస్తాడని ఊహించామా?

సాధారణ కుటుంబం
వివేక్ రామస్వామి తండ్రి వీజీ రామస్వామి జనరల్ ఎలక్ట్రిక్‌లో ఇంజినీర్‌గా పనిచేశారు. తల్లి గీతా రామస్వామి వృద్ధులకు సంబంధించిన మానసిక రోగాల నిపుణురాలు (జీరియాట్రిక్ సైకియాట్రిస్టు). తమిళనాడు మూలాలు ఉన్న రామస్వామి కుటుంబం కేరళలోని పాలక్కాడ్ నుంచి అమెరికా వలస వెళ్లింది. ఆయన భార్య అపూర్వ సర్జన్. యేల్ విశ్వవిద్యాలయంలో పరిచయం వీరి పెళ్లికి దారితీసింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు. సర్జన్ వృత్తిలో తలమునకలైనా అపూర్వ తనకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన విజయాల్లో భార్య పాత్రను ప్రశంసించారు వివేక్.
Read More :
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

