New Year 2025 | 2025 ఏడాదికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమవుతున్నారు. అర్ధరాత్రి ఎప్పుడవుతుందా..? హ్యాపీ న్యూఇయర్ అని ఎప్పుడెప్పుడు చెప్పుకుందామా అని వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ కొన్ని దేశాల్లో ఇప్పటికే కొత్త సంవత్సరం మొదలైపోయింది. పసిఫిక్ సముద్రంలోని కిరిబాటి దీవి (Kiribati Leads) ప్రజలు అందరికంటే ముందుగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకే కొత్త ఏడాది ప్రారంభమైంది. క్రిస్మస్ ద్వీపంగా పిలిచే ఈ దీవిలో న్యూఇయర్ సందడి మొదలైంది.
#WATCH | New Zealand’s Auckland welcomes the #NewYear2025 with fireworks
(Source: Reuters) pic.twitter.com/vO8tw9UvUR
— ANI (@ANI) December 31, 2024
ఇక కిరిబాటి దీవి తర్వాత న్యూజిలాండ్ (New Zealand) ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. భారతీయ కాలమాన ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఆక్లాండ్‌లో కొత్త సంవత్సరం మొదలైంది. హోరెత్తించే మ్యూజిక్, వెలుగులు విరజిమ్మే ఫైర్‌వర్క్స్‌తో అక్కడి ప్రజలు న్యూఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు.
#WATCH | With dazzling fireworks display, New Zealand’s Auckland welcomes #NewYear2025
(Source: Reuters) pic.twitter.com/b4lYWsnL1e
— ANI (@ANI) December 31, 2024
Also Read..
Last Sunrise | ఈ ఏడాదికి ఇదే చివరి సూర్యోదయం.. చూసేయండి.. VIDEOS
last day of the year 2024 | కొత్త ఏడాది వేళ ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Biren Singh | ఈ ఏడాదంతా దురదృష్టకరమే.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన మణిపూర్ సీఎం
IRCTC website | ఐఆర్సీటీసీ వెబ్సైట్ మళ్లీ డౌన్.. నెలలో ఇది మూడోసారి..!