గురువారం 01 అక్టోబర్ 2020
International - Jul 20, 2020 , 18:09:06

ఆస్పత్రిలో చేరిన సౌదీ రాజు

ఆస్పత్రిలో చేరిన సౌదీ రాజు

రియాద్‌ : పిత్తాశయం వాపునకు గురై సౌదీ అరేబియా పాలకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్‌ అజీజ్‌ (84 ) ఆదివారం రాజధాని రియాద్‌లోని దవాఖానలో చేరినట్లు ప్రముఖ వార్తా సంస్థ ఎస్‌పీఏ తెలిపింది. ఇతడు 2015 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు. 

ఇస్లాం పవిత్ర స్థలాల సంరక్షకుడైన సల్మాన్, రాజు కావడానికి ముందు జూన్ 2012 నుంచి సౌదీ కిరీటం యువరాజు. అంతే కాకుండా ఉప ప్రధానమంత్రిగా రెండేండ్లకు పైగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. రియాద్ ప్రాంత గవర్నర్‌గా 50 ఏళ్లకు పైగా పనిచేశారు. సల్మాన్‌ను అందరు MBS అని పిలుస్తుంటారు. అతడు రాజ్య ఆర్థిక వ్యవస్థను మార్చడానికి సంస్కరణలను ప్రారంభించాడు. సాంప్రదాయక ముస్లిం రాజ్యంలో సామాజిక ఆంక్షలను సడలించడం, మహిళలకు ఎక్కువ హక్కులు ఇవ్వడం, ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరిచేందుకు ప్రతిజ్ఞ చేసినందుకుగాను ఈయన ప్రజల చేత ప్రశంసలు అందుకున్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo