Kim Jong Un | కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తర కొరియా నియంత
Kim Jong Un | ప్రజలను తన ఆంక్షలతో ఏడిపించే ఉత్తర కొరియా ( North Korea) నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తాజాగా కన్నీళ్లు పెట్టుకున్నాడు (Gets Emotional).
Kim Jong Un | ఉత్తర కొరియా ( North Korea) నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఉత్తర కొరియాను ప్రపంచం నుంచి వేరు చేసిన ఈ అధినేత ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. వాటి గురించి తెలిస్తే.. మనం బయట ప్రపంచంలో ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామో అర్థమవుతుంది. కఠిన ఆంక్షలతో ఆ దేశ ప్రజలను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నాడు. ప్రజలకు తినేందుకు తిండి లేకపోయినా.. నియంత విలాస జీవితానికి మాత్రం ఎలాంటి లోటూ ఉండకూడదు. ప్రజలే కాదు.. అధికారుల పట్ల కూడా కిమ్ ఎంతో కర్కశంగా వ్యవహరిస్తుంటాడు. ప్రజలను తన ఆంక్షలతో ఏడిపించే ఈ నియంత.. తాజాగా కన్నీళ్లు పెట్టుకోవడం (Gets Emotional) ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇటీవలే కాలంలో ఉత్తర కొరియాలో జనన రేటు గణనీయంగా తగ్గిపోతోంది. జనన రేటు పడిపోతుండటంతో కిమ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జనన రేటు పెంచేందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆ దేశాధ్యక్షుడు కిమ్ దేశంలోని మహిళలను అభ్యర్థించాడు. ప్యాంగ్యాంగ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కిమ్ మాట్లాడుతూ.. ‘దేశంలో యువ శక్తి తగ్గిపోతోంది. అందువల్ల దేశంలోని మహిళలు సాధ్యమైనంత ఎక్కువగా పిల్లలకు జన్మనివ్వాలి. బర్త్ రేటు పడిపోవడాన్ని నిలువరించాలి. అలాగే పిల్లలను సరైన రీతిలో పెంచాలి. ఇవన్నీ తల్లుల బాధ్యతలు’ అంటూ చెప్పారు. ఈ సందర్భంగానే ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి గురై.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. కిమ్ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అది చూసిన కొందరు.. కిమ్ ఏడ్వడం చూసి షాక్ అవుతున్నారు. తన దేశ ప్రజలను కఠిన ఆంక్షలతో ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ నియంత.. ఇలా కన్నీళ్లు పెట్టుకోవడమా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Kim Jong Un CRIES while telling North Korean women to have more babies.
The dictator shed tears while speaking at the National Mothers Meeting as he urged women to boost the countries birth rate. pic.twitter.com/J354CyVnln
— Oli London (@OliLondonTV) December 5, 2023
యూఎన్ పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారం 2023లో ఉత్తర కొరియాలో సగటు జనన రేటు 1.8గా ఉంది. అయితే ఇటీవల దక్షిణ కొరియా జనన రేటు కూడా దారుణంగా పడిపోయింది. ఆ దేశంలో జనన రేటు 0.78గా ఉంది. ఇక జపాన్‌లో ఫెర్టిలిటీ రేటు 1.26గా ఉంది. ఉత్తర కొరియాలో 2.5 కోట్ల జనాభా ఉంది. ఇటీవల ఆ దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. 1990 తరహాలో ఆ దేశం ఆకలితో అల్లాడిపోయింది.
Also Read..
Khushi Kapoor | ది ఆర్చీస్ స్క్రీనింగ్.. తల్లి శ్రీదేవి గౌనులో మెరిసిన ఖుషి కపూర్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

