Deepfake Videos | డీప్‌ఫేక్ బారిన పడిన ప్రియాంకా చోప్రా.. ఫేక్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న నకిలీ వీడియో వైరల్
Deepfake Videos | డీప్‌ఫేక్ వీడియోస్ (Deepfake Videos).. ఈ పదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అందుకు కారణం హీరోయిన్ల ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే. తాజాగా గ్లోబల్ స్టార్‌గా పేరుపొందిన బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సైతం డీప్‌ఫేక్ బారిన పడ్డారు.
Deepfake Videos | డీప్‌ఫేక్ వీడియోస్ (Deepfake Videos).. ఈ పదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అందుకు కారణం హీరోయిన్ల ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే. డీప్‌ఫేక్ వీడియోలను కట్టడి చేసేందుకు కేంద్రం ఓ వైపు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ.. దేశంలోని టాప్ హీరోయిన్లు మాత్రం ఒకరి తర్వాత ఒకరు దీని బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే నేషనల్ క్రష్‌గా పేరుపొందిన దక్షిణాది తార రష్మిక మందన్నా (Rashmika Mandanna), బాలీవుడ్ స్టార్ నటులు కత్రినా కైఫ్, కాజోల్, ఆలియా భట్‌కు సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా గ్లోబల్ స్టార్‌గా పేరుపొందిన బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సైతం డీప్‌ఫేక్ బారిన పడ్డారు.
పీసీకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఈ సారి ఆకతాయిలు నటి ముఖం మార్చకుండా వాయిస్‌ను మార్చేయడం గమనార్హం. ప్రియాంక గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోకు ఇప్పుడు వాయిస్ మార్చేసి వైరల్ చేశారు. ఆ వీడియోలో ఆమె ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు క్రియేట్ చేశారు. ఆ బ్రాండ్ కారణంగా 2023లో తన వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని.. అందరూ దాన్ని ఉపయోగించాలని పీసీ చెప్తున్నట్లుగా వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా కూడా క్రియేట్ చేస్తున్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా డీప్‌ఫేక్ వీడియోలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సినీతారలు ఒకరి తర్వాత ఒకరు వీటి బారిన పడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సినీఇండస్ట్రీని తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ముందుగా నటి రష్మిక మందన్నా సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో (deepfake video) వైరల్ అయిన విషయం తెలిసిందే. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు, సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ తర్వాత బాలీవుడ్ నటులు కత్రినాకైఫ్, కాజోల్, ఆలియా భట్ కూడా డీప్‌ఫేక్ బారిన పడ్డారు. మరోవైపు డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది. డీప్‌ఫేక్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా సంస్థలకు కూడా నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించింది.
మార్ఫింగ్ చేస్తే మూడేండ్ల జైలు శిక్ష..
సోషల్ మీడియా కంపెనీలకు కేంద్రం ఓ అడ్వయిజరీని కూడా జారీ చేసింది. కృత్రిమ మేధ (ఏఐ)తో కంటెంట్‌ను తయారుచేస్తూ తప్పుదోవ పట్టిస్తున్న వాటిపై 24 గంటల్లోగా చర్యలు చేపట్టాలని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్..తదితర సోషల్ మీడియా సంస్థలకు సూచించింది. ఐటీ చట్టం-2000 సెక్షన్ 66-డీ కింద చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు అవకాశముందని తెలిపింది. కంప్యూటర్ సాంకేతికతను ఉపయోగించి వ్యక్తుల్ని మోసగిస్తే ఈ సెక్షన్ కింద రూ.లక్ష వరకు జరిమానా, మూడేండ్ల జైలు శిక్ష విధించే అవకాశముందని అడ్వైయిజరీలో కేంద్రం గుర్తు చేసింది. ఐటీ నిబంధనావళిలో రూల్ 3(2) (బీ)ను ఉపయోగించి తప్పుడు వీడియోలను, కంటెంట్‌ను తొలగించవచ్చునని తెలిపింది. ఫిర్యా దు అందిన 24 గంటల్లోగా మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలపై చర్యలు చేపట్టాలని పేర్కొన్నది.
Also Read..
Chitra Shukla | పెళ్లిపీటలెక్కనున్న టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరంటే.?
BJP: ఆ మూడు రాష్ట్రాలకు కొత్త సీఎంల వేటలో బీజేపీ !
Revanth Reddy | ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేతలతో వరుస భేటీలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

