Revanth Reddy | ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేతలతో వరుస భేటీలు
Revanth Reddy | తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన పేరును ప్రకటించడానికి ముందు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు.
న్యూఢిల్లీ: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన పేరును ప్రకటించడానికి ముందు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. అప్పటికే హైకమాండ్ ఆయనను సీఎంగా ప్రకటించింది. ఢిల్లీకి వెళ్లగానే తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మానిక్‌రావు థాక్రేను రేవంత్ కలిశారు.
ఇవాళ ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలతో రేవంత్‌రెడ్డి వరుస భేటీలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఆయన భేటీ అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించిన నేపథ్యంలో వారిద్దరికీ రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో ఆయన సమావేశం కానున్నారు.
రేపు (గురువారం) హైదరాబాద్‌లో జరగబోయే తన ప్రమాణస్వీకారానికి వారిని ఆహ్వానించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో మంత్రివర్గం ఏర్పాటు, ఇతర అంశాలపై కూడా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

