Khushi Kapoor | ది ఆర్చీస్ స్క్రీనింగ్.. తల్లి శ్రీదేవి గౌనులో మెరిసిన ఖుషి కపూర్
Khushi Kapoor | శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఖుషి ‘ ది ఆర్చీస్’ (The Archies) చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. గత రాత్రి ఈ చిత్ర ప్రీమియర్ షో నిర్వహించారు. ఈ షోలో ఖుషి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి చిత్రం కావడంతో సెంటిమెంట్‌గా తన తల్లి శ్రీదేవి డ్రెస్ (Sridevis Gown)లో ఈవెంట్‌కు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Khushi Kapoor | బాలీవుడ్‌తోపాటు సౌత్‌లో కూడా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది అలనాటి తార దివంగత నటి శ్రీదేవి. అదే తరహాలో ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ కూడా ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. తల్లి అడుగుజాడల్లో నడుస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. ఇప్పుడు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఖుషి ‘ ది ఆర్చీస్’ (The Archies) చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ కూడా నటిస్తోంది. ముంబైలోని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్లో (Nita Mukesh Ambani Cultural Centre) గత రాత్రి ఈ చిత్ర ప్రీమియర్ షో నిర్వహించారు.
ఈ షోకు జాన్వీ కపూర్‌తో పాటు బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. ఇక ఈ షోలో ఖుషి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి చిత్రం కావడంతో సెంటిమెంట్‌గా తన తల్లి శ్రీదేవి డ్రెస్ (Sridevis Gown)లో ఈవెంట్‌కు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బంగారు వర్ణంలోని స్ట్రాప్‌లెస్ గౌను ధరించి తన తల్లికి ప్రత్యేకమైన రీతిలో నివాళులర్పించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2013లో ఐఐఎఫ్ఏ (International Indian Film Academy Awards) అవార్డ్స్ వేడుకలో శ్రీదేవి ఇదే గౌను ధరించారు. రెడ్ కార్పెట్‌పై శ్రీదేవి ఈ గౌనుతో నడిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పుడిదే గౌనును ఖుషి ధరించి అందరినీ ఆకర్షించింది. అంతేకాదు, తల్లి ఆభరణాలను కూడా వేసుకుంది.
షారుఖ్ ఖాన్ గారాలపట్టి సుహానా ఖాన్ (Suhana khan), శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ (Kushi kapoor), అమితాబ్ మనువడు అగస్త్య నంద (Agastya Nanda) ప్రధాన పాత్రల్లో అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ది ఆర్చీస్’ (The Archies Movie). గల్లీ బాయ్, జిందగీ నా మిలేగీ దోబారా, లస్ట్ స్టోరీస్ చిత్రాల ఫేం బాలీవుడ్ స్టార్ దర్శకురాలు జోయా అక్తర్ (Zoya Akthar) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో డిసెంబర్ 7 ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమాను 1964 ఇయర్లో జరిగిన కథగా తెరకెక్కించగా.. బాల్యం, టీనేజీలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందింది.
Also Read..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

