Nirmala Sitharaman | అత్యంత శక్తిమంతమైన మహిళగా నిర్మలా సీతారామన్.. ఫోర్బ్స్ జాబితాలో వరుసగా ఐదోసారి చోటు
Nirmala Sitharaman | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ (Forbes) విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితా (Worlds Most Powerful Women List)లో చోటు సాధించారు.
Nirmala Sitharaman | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ (Forbes) విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితా (Worlds Most Powerful Women List)లో చోటు సాధించారు. దేశంలో మొత్తం నలుగురికి ఈ జాబితాలో చోటు దక్కగా.. అందులో నిర్మలమ్మ తొలి స్థానంలో నిలిచారు. ఇక వరుసగా ఐదో సంవత్సరం ఈ జాబితాలో ఆమె చోటు దక్కించుకోవడం విశేషం.
శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ తొలిసారి 2019లో చోటు దక్కించుకున్నారు. ఆ ఏడాది ఆమెకు 34వ ర్యాంక్ దక్కింది. 2020లో 41వ స్థానం, 2021లో 37వ స్థానం సాధించిన ఆమె 2022లో 36వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు 32వ స్థానంలో ఐదోసారి చోటు దక్కించుకోవడం విశేషం.
ఇక ఈ జాబితాలో హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈవో రోష్నీ నడార్ మల్హోత్రా 60వ స్థానంలో నిలిచారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మోండల్ 70వ స్థానంలో, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 76 స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బాస్ క్రిస్టీన్ లగార్డ్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
Also Read..
SpiceJet | ప్రయాణికుడికి గుండెపోటు.. కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mitchell Johnson: వార్నర్‌తో వివాదం.. కామెంట్రీ నుంచి జాన్సన్ ఔట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

