Kamala Harris | అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) కాలిఫోర్నియా గవర్నర్ (California Governor) పదవికి పోటీపడుతున్నట్లు తెలిసింది. ఈ వేసవి చివరి వరకు దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కమలా హారిస్ దగ్గరి వ్యక్తులను ఊటంకిస్తూ అమెరికా మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
కాగా, గతేడాది నవంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ అధ్యక్షురాలి పదవికి పోటీ పడిన విషయం తెలిసిందే. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన కమలా హారిస్.. ట్రంప్ చేతిలో ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె బయట ఎక్కువగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తన సొంత రాష్ట్రం కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం. దీనిపై ఆమె త్వరలోనే నిర్ణయం ప్రకటించనున్నట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. కాలిఫోర్నియా గవర్నర్ ఎన్నికలు వచ్చే ఏడాది జూన్లో జరగనున్నాయి.
Also Read..
Musk Vs Rubio | కేబినెట్ మీటింగ్.. ట్రంప్ ముందే వాగ్వాదానికి దిగిన మస్క్, రుబియో..!
Justin Trudea | డొనాల్డ్ ట్రంప్ సుంకాలు.. కెనడా ప్రధాని కంటతడి
Donald Trump | సుంకాలు, ఆంక్షలు విధిస్తా.. రష్యాకు ట్రంప్ హెచ్చరిక