Musk Vs Rubio | కేబినెట్ మీటింగ్.. ట్రంప్ ముందే వాగ్వాదానికి దిగిన మస్క్, రుబియో..!
Musk Vs Rubio | అమెరికాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్వహించిన కేబినెట్ మీటింగ్‌లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో (Marco Rubio) మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలిసింది.
Musk Vs Rubio | అమెరికాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్వహించిన కేబినెట్ మీటింగ్‌లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో (Marco Rubio) మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలిసింది. అధ్యక్షుడు ట్రంప్ ముందే ఇద్దరూ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగినట్లు అమెరికా మీడియా పేర్కొంది.
రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ శాఖ బాధ్యతలను టెస్లా బాస్ ఎలాన్ మస్క్‌కు అప్పగించారు. మెరుగైన పాలన, ప్రభుత్వంలో వృథా ఖర్చుల్ని తగ్గించేందుకు డోజ్ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ట్రంప్.. కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కు మస్క్‌తోపాటు విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా హాజరయ్యారు.
ఆ సమయంలో మస్క్ మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో పనిచేయని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పారు. అయితే, రుబియో మాత్రం ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించలేదని వ్యాఖ్యానించారు. మస్క్ మాటలకు రుబియో సహనం కోల్పోయారు. ఇప్పటికే 1,500 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసినట్లు చెప్పారు. తాను ఉద్యోగులను తొలగించాలంటే పదవీ విరమణ చేసిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుందంటూ సమాధానమిచ్చారు. అయితే, మస్క్ – రుబియో మధ్య వాగ్వాదం వార్తలపై ట్రంప్ స్పందించారు. ఆ వార్తలను కొట్టిపారేశారు. తాను అక్కడే ఉన్నానని.. మీటింగ్ ఘర్షణ వంటిది ఏమీ జరగలేదని స్పష్టం చేశారు.
Also Read..
US Visa | అమెరికా కొత్త నిబంధన.. వీసా కావాలంటే సోషల్ మీడియా వివరాలు వెల్లడించాల్సిందే
Justin Trudea | డొనాల్డ్ ట్రంప్ సుంకాలు.. కెనడా ప్రధాని కంటతడి
Donald Trump | సుంకాలు, ఆంక్షలు విధిస్తా.. రష్యాకు ట్రంప్ హెచ్చరిక
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

