US Visa | అమెరికా కొత్త నిబంధన.. వీసా కావాలంటే సోషల్ మీడియా వివరాలు వెల్లడించాల్సిందే
అమెరికా వీసా, గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులతోపాటు తమ సోషల్ మీడియా ఖాతాల సమాచారాన్ని కూడా ఇప్పుడు అందచేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్(డీహెచ్ఎస్) మార్చి 5న ఓ నోటీసులో వెల్లడించింది.
US Visa | న్యూఢిల్లీ, మార్చి 7 : అమెరికా వీసా, గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులతోపాటు తమ సోషల్ మీడియా ఖాతాల సమాచారాన్ని కూడా ఇప్పుడు అందచేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్(డీహెచ్ఎస్) మార్చి 5న ఓ నోటీసులో వెల్లడించింది. గ్రీన్ కార్డులు, పౌరసత్వం, ఇతర ప్రయోజనాలు కోరుతూ దరఖాస్తు చేసుకునే భారతీయులు సహా ఏటా 35 లక్షల మందికిపైగా విదేశీయుల నుంచి ఈ సమాచారాన్ని కోరనున్నట్టు డీహెచ్ఎస్ ప్రకటించింది. ఇమ్మిగ్రేషన్ స్క్రీనింగ్‌ను కట్టుదిట్టం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన 14161 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో భాగంగా ఈ ప్రతిపాదన ఉంది.
కొత్త నిబంధన మేరకు దరఖాస్తుదారులు తొమ్మిది ప్రధాన ఇమ్మిగ్రేషన్ ఫారాలలో తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌కు అందచేయవలసి ఉంటుంది. పాస్వర్డ్ తెలియచేయవలసిన అవసరం లేదు. ఈ సమాచారాన్ని దరఖాస్తుల గుర్తింపును తనిఖీ చేసేందుకు, జాతీయ భద్రతా ముప్పులను అంచనా వేసేందుకు ఉపయోగిస్తారు. భారతీయ ఇమ్మిగ్రెంట్లు ముఖ్యంగా స్టెమ్ ప్రొఫెషనల్స్, హెచ్-1బీ ఆశావహులు, ఈబీ-5 పెట్టుబడిదారులకు ఈ కొత్త నిబంధనతో నిఘా మరింత అధికమవుతుంది. సాధారణ ఆన్లైన్ సంభాషణలు కూడా సమీక్షకు గురవుతాయని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరించారు. ఆన్లైన్లో వ్యక్తుల ప్రవర్తనపై నిఘా ఉంటుందని, పోస్టులు, కామెంట్లు, చాటింగ్‌లపై సమీక్ష ఉండే అవకాశం ఉందని వారు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

