Justin Trudea | టొరంటో: కొద్ది రోజుల్లో పదవి నుంచి దిగిపోతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన ఆఖరి మీడియా సమావేశంలో తీవ్ర ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. తన తొమ్మిదేళ్ల పాలనలోని గందరగోళ క్షణాలను, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల గురించి వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అధికార లిబరల్ పార్టీ కొత్త ప్రధానిని ఎన్నుకున్న తర్వాత ఆదివారం ట్రూడో పదవి నుంచి తప్పుకుంటారు. కాగా, కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులకు గురువారం నుంచి అమరికా 25 శాతం టారిఫ్లు విధించింది. దీని ప్రభావంతో మార్కెట్లు కుప్పకూలడంతో దాని అమలును ట్రంప్ వచ్చే నెలకు వాయిదా వేశారు.