రామ్‌చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొని ఉంది. పాటలు, ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో బ్యాలెన్స్‌గా ఉన్న షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో చిత్రబృందం బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో ఓ ప్రత్యేక గీతంతో పాటు కొన్ని సన్నివేశాలను పూర్తి చేస్తారట. ఈ స్పెషల్ సాంగ్‌లో ఓ అగ్ర కథానాయిక నర్తించనుందని ఫిల్మ్‌నగర్ టాక్. ద్వితీయార్ధంలో వచ్చే ఈ పాట కోసం సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ హుషారైన ట్యూన్‌ను సిద్ధం చేశారని, మాస్‌ను ఉర్రూతలూగించే పాట అవుతుందని చెబుతున్నారు. జాన్వీకపూర్, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ, బొమన్ ఇరానీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్. రత్నవేలు, సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.