Donald Trump | మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)పై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కంటే బైడెన్ పరిపాలన చాలా అధ్వానంగా ఉందంటూ విమర్శలు గుప్పించారు. అమెరికా చరిత్రలోనే బైడెన్‌ది చెత్త పరిపాలనగా అభివర్ణించారు. తన కంటే బైడెన్ చెత్త అధ్యక్షుడని తెలుసుకొని జిమ్మీ కార్టర్ సంతోషంగా కన్నుమూశారంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు.
వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni)తో సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన చాలా భయంకరమైనది. వారు ఎన్నికల్లో మోసం చేయగలను. వారు చేయగలిగింది అంతే.. అసమర్థులు. ప్రజలకు ఏమీ చేయలేకపోయారు. దేశ చరిత్రలోనే ఆయనది అత్యంత చెత్త పరిపాలన. జిమ్మీ కార్టర్ కంటే దారుణం. అందుకే తన కంటే బైడెన్ చెత్త అధ్యక్షుడని తెలుసుకొని జిమ్మీ కార్టర్ సంతోషంగా కన్నుమూశారు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన జిమ్మీ కార్టర్(100) గతేడాదని డిసెంబర్ 30న కన్నుమూసిన విషయం తెలిసిందే. 1977 నుంచి 1981 మధ్య డెమోక్రటిక్ పార్టీ తరఫున కార్టర్ అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పని చేశారు. తన పదవీకాలంలో ప్రపంచ శాంతి కోసం ఆయన కృషి చేశారు. 1979లో ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించారు. చైనాతో దౌత్యపరమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు అమెరికా విదేశాంగ విధానంలో మానవ హక్కులకు ప్రాధాన్యం కల్పించారు. 1980 ఎన్నికల్లో ఆయన ఓడిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రపంచ శాంతికి కృషి చేశారు. దీంతో 2002లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
Trump: “Jimmy Carter died a happy man. You know why? Because he wasn’t the worst president. Joe Biden was.” pic.twitter.com/ufQZA0TVq1
— Aaron Rupar (@atrupar) April 17, 2025
Also Read..
Trump – Meloni | ట్రంప్‌తో ఇటలీ ప్రధాని భేటీ.. వాణిజ్య ఒప్పందంపై చర్చ
Hijack | కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు యత్నం.. నిందితుడిపై ప్రయాణికుడి కాల్పులు
US Attacks | యెమెన్‌పై అమెరికా వైమానిక దాడులు.. 38 మంది మృతి