Trump – Meloni | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 70కిపైగా దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. పెంచిన సుంకాలు త్వరలో అమల్లోకి రానున్నాయి. ట్రంప్ టారిఫ్‌లతో ఆయా దేశాలు సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఇటలీ ప్రధాని మెలోనీ (Giorgia Meloni) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్య ఒప్పందం అంశంపై చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టారిఫ్‌లతో ఆదాయం వస్తోందన్నారు. టారిఫ్ డీల్ విషయంలో తాను తొందర పడటం లేదని వ్యాఖ్యానించారు. ఆ ఒప్పందాలు ఓ నిర్దిష్ట సమయంలో జరుగుతాయన్నారు. ఈయూ, ఇతర దేశాలతో డీల్స్ చేసుకోవడం చాలా సులువే అని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో వంద శాతం ఒప్పందం జరుగుతుందని హామీ ఇచ్చారు. సుంకాల ప్రకటన తర్వాత ట్రంప్‌తో డైరెక్ట్‌గా చర్చలు జరిపిన తొలి ఐరోపా దేశ నేతగా మెలోనీ నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పశ్చిమాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.
ఏప్రిల్ 2న భారత్ సహా పలు దేశాలపై ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఐరోపా నుంచి వచ్చే దిగుమతులపై 20 శాతం టారిఫ్‌లు విధించారు. ఆ తర్వాత పెంచిన టారిఫ్‌ల అమలును 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పలు దేశాలు టారిఫ్‌ల విషయంపై చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
Also Read..
Hijack | కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు యత్నం.. నిందితుడిపై ప్రయాణికుడి కాల్పులు
Trump Tariffs | అధిక టారిఫ్‌లతో తీవ్ర పరిణామాలు తప్పవు.. ట్రంప్ విధానాలపై ఫెడ్ చైర్మన్ ఆగ్రహం
CT Scan | సీటీ స్కాన్‌తో క్యాన్సర్!.. వయసు ఎంత తక్కువైతే ముప్పు అంత ఎక్కువ!