Gaza | హమాస్ అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్ (Gaza)పై ఇజ్రాయెల్ దాడులను (Israeli strikes) తీవ్రతరం చేసింది. గాజాలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆసుపత్రి వర్గాలు తాజాగా వెల్లడించాయి. అనేక మంది గాయపడినట్లు తెలిపాయి. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 2023లో ప్రారంభమైన విషయం తెలిసిందే. 21 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఒత్తిడి చేస్తున్నారు. అయినా చర్చల్లో ఎలాంటి పురోగతీ కనిపించట్లేదు (no sign of progress in ceasefire talks). ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ రెండు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు భేటీ అయ్యారు. బైట్‌హౌస్‌లో నెతన్యాహుతో సమావేశమయ్యారు. యుద్ధం ముగింపు, బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందం వంటి అంశాలపై చర్చించారు.
గాజాలో 60 రోజుల కాల్పుల విరమణ : ట్రంప్
గాజా అంశంలో తమ ప్రతినిధులు ఇజ్రాయెల్‌తో సుదీర్ఘ చర్చలు చేపట్టారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపిన విషయం తెలిసిందే. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని, ఆ సమయంలో అన్ని పార్టీలతో కలిసి యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తామన్నారు. శాంతి ఒప్పందం కోసం ఖతార్, ఈజిప్ట్ తీవ్రంగా ప్రయత్నించాయని, వాళ్లే దీనికి సంబంధించిన తుది ప్రతిపాదన చేస్తారన్నారు. మిడిల్ఈస్ట్ మంచి కోసం హమాస్ ఆ ఒప్పందాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే, గాజాపై యుద్ధాన్ని పూర్తిగా ఆపేస్తామంటేనే ఒప్పందాన్ని అంగీకరిస్తామని హమాస్ సంస్థ తెలిపింది.
గాజాలో 58 వేలు దాటిన మృతుల సంఖ్య
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 2023లో ప్రారంభమైన విషయం తెలిసిందే. హమాస్ ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో 1200 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారంలో ఇప్పటివరకు 58 వేలకుపైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో పెద్ద సంఖ్యలో జనాభా నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు.
Also Read..
Iran | ట్రంప్‌పై డ్రోన్ దాడి జరగొచ్చు.. ఆయనకు ఫ్లోరిడా నివాసం కూడా సేఫ్ కాదు : ఇరాన్
Europe Court | మలేషియా విమానాన్ని కూల్చింది రష్యానే : యూరప్ కోర్టు