Europe Court | మలేషియా విమానాన్ని కూల్చింది రష్యానే : యూరప్ కోర్టు
Europe Court | యూరప్‌లోని అత్యున్నత మానవ హక్కుల కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం MH17ను కూల్చింది రష్యా (Russia)నే అని పేర్కొంది.
Europe Court | యూరప్‌లోని అత్యున్నత మానవ హక్కుల కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం MH17ను కూల్చింది రష్యా (Russia)నే అని పేర్కొంది. అంతేకాదు ఉక్రెయిన్‌లో దశాబ్ద కాలంగా మాస్కో దురాగతాలకు పాల్పడిందని ఆరోపిస్తూ కీవ్, నెదర్లాండ్స్ దాఖలు చేసిన మరో మూడు కేసుల్లో యూరోపియన్ మానవ హక్కుల కోర్టు (Europe Court) రష్యాకు వ్యతిరేకంగా తీర్పులు వెలువరించింది.
2014, జులై 17న ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ MH17ను (Malaysia Airlines Flight MH17) ఉక్రెయిన్ భూభాగం పైనుంచి రష్యా క్షిపణిని వినియోగించి మాస్కో అనుకూల తిరుగుబాటుదారులు కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 283 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రష్యా నిర్మిత బక్ క్షిపణితో ఈ దాడి జరిగిందని తేల్చింది. ‘ఉద్దేశపూర్వకంగానే విమానంపై దాడి చేశారని, బహుశా అది సైనిక విమానంగా భావించి ఉండొచ్చని ఆధారాలు సూచిస్తున్నాయి’ అని స్ట్రాస్‌బర్గ్ కోర్టు తెలిపింది. ఈ ఘటనపై తన ప్రమేయాన్ని రష్యా నిరాకరించడం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని కోర్టు పేర్కొంది. ఈ విషయాన్ని మాస్కో సరిగ్గా దర్యాప్తు చేయడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేకాదు, ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. వేలాది మంది పౌరుల మరణానికి కారణమవడమే కాకుండా, ఉక్రెయిన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు అత్యాచారాన్ని ఒక యుద్ధ ఆయుధంగా వాడుకుందని ఆక్షేపించింది. హింస, పౌర మౌలిక సదుపాయాల ధ్వంసం, ఉక్రేనియన్ పిల్లలను అపహరించడం వంటి నేరాలకు పాల్పడిందని కోర్టు నిర్ధరించింది. ‘రష్యన్ దళాలు ఉక్రెయిన్‌లో అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించాయి. వేలాది మంది పౌరులను చంపి గాయపరిచాయి. భయాందోళనలను సృష్టించాయి’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇక కోర్టు తీర్పుపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఈ తీర్పును తాము పాటించబోమని, దానికి ఎలాంటి విలువ లేదని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కొట్టిపారేశారు. మరోవైపు, ఉక్రెయిన్ ఈ తీర్పును చారిత్రక, అపూర్వ విజయంగా అభివర్ణించింది.
Also Read..
Shubhanshu Shukla | అంతరిక్షంలో రైతుగా మారిన శుభాన్షు శుక్లా.. మెంతి, పెసర విత్తనాలు పెంచుతూ..
Donald Trump | బ్రెజిల్‌పై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్
క్యాన్సర్‌కు ‘ఏఐ’ ఔషధం!.. సత్ఫలితాలిస్తే గేమ్ఛేంజరే!?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

