Donald Trump | గతేడాది జూలై 13న అమెరికాలోని పెన్సిల్వేనియాలో గల బట్లర్ (Butler) కౌంటీలో చేపట్టిన అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల (Secret Service agents) వైఫల్యమే కారణమని తాజాగా తేలింది. దీంతో ఆ రోజు విధుల్లో ఉన్న ఆరుగురు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ సీక్రెట్ సర్వీస్ నిర్ణయం తీసుకొంది. ‘బట్లర్‌లో ట్రంప్‌పై జరిగిన దాడి ఘటనకు పూర్తి బాధ్యత సీక్రెట్ సర్వీస్‌దే. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం. సస్పెండ్ అయిన వారందరినీ భవిష్యత్తులో కీలక విధులకు దూరంగా ఉంచుతాము’ అని సీక్రెట్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ మ్యాట్ క్విన్న్ వెల్లడించారు.
కాగా, గతేడాది అధ్యక్ష ఎన్నికలకు ముందు పెన్సిల్వేనియా (Pennsylvania)లో ట్రంప్ ఎన్నికల ర్యాలీ (Trump campaign rally) చేపట్టిన విషయం తెలిసిందే. బట్లర్ కౌంటీలో జులై 13న చేపట్టిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ వేదికపై మాట్లాడుతూ తనకు కుడివైపున ఉన్న ఓ అక్రమ వలసదారుల గణాంకాలకు సంబంధించిన చార్ట్‌ను చూపిస్తూ అటు వైపు తల తిప్పారు. ఆ తర్వాత దుండగుడు కాల్పులు జరపగా బుల్లెట్ ట్రంప్ చెవిని తాకింది. ఒక వేళ ట్రంప్ అటువైపు తిరగకుంటే బుల్లెట్ నేరుగా తలలోకి దూసుకెళ్లేది. ఇక ఈ కాల్పుల ఘటనలో మాజీ అగ్నిమాపక సిబ్బంది కోరే ప్రాణాలు కోల్పోయారు.
Also Read..
Iran | ట్రంప్‌పై డ్రోన్ దాడి జరగొచ్చు.. ఆయనకు ఫ్లోరిడా నివాసం కూడా సేఫ్ కాదు : ఇరాన్
Europe Court | మలేషియా విమానాన్ని కూల్చింది రష్యానే : యూరప్ కోర్టు
Shubhanshu Shukla | అంతరిక్షంలో రైతుగా మారిన శుభాన్షు శుక్లా.. మెంతి, పెసర విత్తనాలు పెంచుతూ..