Iran | ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు ఇరాన్ (Iran) నుంచి హత్య బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ట్రంప్‌పై డ్రోన్ దాడి (drone Attack) చేస్తామంటూ ఇరాన్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఓ టెలివిజన్‌తో ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) సలహాదారు జావద్ లారిజాని (Javad Larijani) మాట్లాడుతూ ఈ మేరకు ట్రంప్‌ను హెచ్చరించారు. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇకపై ఆయన ఫ్లోరిడా (Florida)లోని మార్-ఎ-లాగో (Mar-a-Lago) నివాసం కూడా సురక్షితం కాదు. అక్కడ ఆయన సన్‌బాత్ చేసే సమయంలో డ్రోన్ దాడి జరగొచ్చు. ఇది చాలా ఈజీ’ అని అన్నారు. 2020లో ఇరానియన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యలో ట్రంప్ పాత్రను ప్రస్తావిస్తూ ఈ హెచ్చరికలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని లక్ష్యంగా చేసుకున్నా ప్రతీకారం తప్పదని తీవ్రంగా హెచ్చరించారు.
Also Read..
Europe Court | మలేషియా విమానాన్ని కూల్చింది రష్యానే : యూరప్ కోర్టు
Shubhanshu Shukla | అంతరిక్షంలో రైతుగా మారిన శుభాన్షు శుక్లా.. మెంతి, పెసర విత్తనాలు పెంచుతూ..
Donald Trump | బ్రెజిల్‌పై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్