సోమవారం 06 జూలై 2020
International - Jun 30, 2020 , 01:12:42

ట్రంప్‌పై ఇరాన్‌ అరెస్టు వారెంట్‌

ట్రంప్‌పై ఇరాన్‌ అరెస్టు వారెంట్‌

టెహ్రాన్‌: అమెరికాతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అరెస్ట్‌ చేసేందుకు ఇరాన్‌ సోమవారం ఏకంగా వారంట్‌ జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 3న అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో ఇరాన్‌కు చెందిన కీలక  సైన్యాధికారి ఖాసీం సులేమానీ ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. ఈ వారెంట్‌ను జారీ చేసింది. ట్రంప్‌తోపాటు మరో 35 మందికి ఇరాన్‌ ప్రాసిక్యూటర్‌ అలీ అల్‌ఖ్వాసిమెర్‌ పేరిట వారెంట్‌ విడుదలైంది. ఈ మేరకు తమకు సాయం చేయాలని ఇంటర్‌పోల్‌ను కూడా ఇరాన్‌ కోరింది.  


logo