కమల్‌హాసన్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘విక్రమ్’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్‌హాసన్ పోలీస్ అధికారి పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆయన పోలీస్ పాత్రలో నటించనున్న చిత్రమిది కావడం గమనార్హం. ఓ ఖైదీని కాపాడే బాధ్యతను తీసుకునే పోలీస్ ఆఫీసర్‌గా కమల్ పాత్ర ప్రయోగాత్మక పంథాలో ఉంటుందని తెలిసింది. రెస్టారెంట్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనున్నట్లు సమాచారం. ఇన్నాళ్లు ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న కమల్‌హాసన్ త్వరలో ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు చెబుతున్నారు. మలయాళనటుడు ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించబోతున్నారు.