కారేపల్లి, మే 20 : “భగీరథ నీరంతా వృథా”అనే శీర్షికన నమస్తే తెలంగాణలో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కారేపల్లి మండల కేంద్రంలో కూల్చివేసిన పాత వాటర్ ట్యాంక్ ప్రదేశంలో మిషన్ భగీరథ పైప్ పగిలి గత కొన్ని రోజులుగా నీళ్లు వృథాగా పోతున్నాయి. దీంతో ఆ చుట్టుపక్కల నీటి మడుగులు ఏర్పడగా పందులు స్వైర విహారం చేయడంతో సమీప కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయమై స్థానికులు నమస్తే తెలంగాణలో వార్తా కథనం వెలువడింది. స్పందించిన ఇన్చార్జి ఎంపీడీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేందర్ అక్కడకు చేరుకుని పైప్లైన్లకు మరమ్మతులు చేయించారు. సమస్య పరిష్కారం కావడంతో సమీప ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.