Vladimir Putin | చైనా చేరుకున్న రష్యా ప్రెసిడెంట్ పుతిన్.. ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు జిన్‌పింగ్
Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా చేరుకున్నారు. మంగళవారం రాత్రి చైనా రాజధాని బీజింగ్‌లో అడుగుపెట్టిన పుతిన్‌కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఘన స్వాగతం పలికారు.
Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా చేరుకున్నారు. మంగళవారం రాత్రి చైనా రాజధాని బీజింగ్‌లో అడుగుపెట్టిన పుతిన్‌కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఘన స్వాగతం పలికారు. అనంతరం బుధవారం బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్‌లో పుతిన్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఘన స్వాగతం పలికారు.
పుతిన్, జిన్‌పింగ్ మధ్య ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే, ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ వార్, వ్యాపార, వాణిజ్య, రక్షణరంగం సహా అనేక అంశాలపై చర్చిస్తారు. రెండు రోజులపాటు పుతిన్ చైనాలో పర్యటిస్తారు. గత వారమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అగ్రదేశాలైన రష్యా, అమెరికా అధ్యక్షులు.. వారం వ్యవధిలోనే మరో అగ్రదేశమైన చైనాలో పర్యటించడం అత్యంత ఆసక్తి కలిగిస్తోంది. చైనా పర్యటన సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉన్నత దశకు చేరుకున్నాయని వ్యాఖ్యానించారు.
VIDEO | Beijing, China: Russian President Vladimir Putin receives ceremonial welcome at the Great Hall of the People.
Putin arrived in Beijing on Tuesday night on a two-day state visit for talks with his Chinese counterpart Xi Jinping, days after US leader Donald Trump… pic.twitter.com/3M3bqv3jCF
— Press Trust of India (@PTI_News) May 20, 2026
పుతిన్ చైనాలో పర్యటించడం ఇది 25వ సారి. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరగనున్న తాజా చర్చలు రెండు దేశాల అభివృద్ధికి మరింత దోహదం చేస్తాయని చైనా వ్యాఖ్యానించింది. ఇక, ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరాన్‌ను అణ్వాయుధ దేశం చేయకూడదని రెండు దేశాలు నిర్ణయించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Beijing
- china
- Russia
- Vladimir Putin
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

