Sushila Karki | నేపాల్‌లో యువత చేపట్టిన నిరసనలు (Nepal Protests) హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. రాజకీయ నేతల అవినీతి, సోషల్ మీడియాపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ జన్ జడ్ (Gen Z) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలతో హిమాలయ దేశం రగిలిపోతోంది. సోమవారం ప్రారంభమైన ఈ ఘర్షణల కారణంగా ఇప్పటి వరకూ 51 మంది మరణించినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. మృతుల్లో భారతీయ మహిళ కూడా ఉన్నారు. ఆమెను ఉత్తరప్రదేశ్ (UP)లోని ఘజియాబాద్‌కు చెందిన మహిళగా గుర్తించారు. ఇక ఈ ఘర్షణల్లో సుమారు 1,500 మంది వరకూ గాయపడ్డారు.
మరోవైపు నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వ సారథి (Nepal interim PM) ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాత్కాలిక ప్రభుత్వ సారథి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వ సారథి ఎంపిక విషయంలో జన్ జడ్ నిరసనకారుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఓ వర్గం వారు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ (Sushila Karki) పేరును ప్రతిపాదించగా.. మరో వర్గం నేపాల్ విద్యుత్ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ కుల్మన్ ఘీషింగ్ పేరును తాత్కాలిక ప్రభుత్వ సారథిగా వారు ప్రతిపాదించారు. వీరిద్దరిలో సుశీలా కర్కీని తాత్కాలిక ప్రధాన మంత్రిగా నియమించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
Also Read..
Donald Trump | సుంకాల వివాదం వేళ.. ఈ ఏడాది చివర్లో భారత్‌కు ట్రంప్..?