Marco Rubio | సుంకాల (Trump Tariffs) వివాదం కొనసాగుతున్న వేళ (India-US Ties) భారత్‌పై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అమెరికాతో అత్యున్నత సంబంధాలు కలిగి ఉన్న దేశాల్లో భారత్ ఒకటని పేర్కొన్నారు. భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్గీ గోర్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే సెర్గీ గోర్ (Sergio Gor) అభ్యర్థిత్వాన్ని సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సెనెట్ ఆమోదం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సెర్గీ గోర్‌ను రూబియో పరిచయం చేస్తూ ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ పాత్ర చాలా ముఖమైందని తెలిపారు. ప్రస్తుతం భారత్- అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం సహా ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఆయన ప్రస్తావించారు. భారత్‌తో సంబంధాల విషయంలో మనం కొంత అసాధారణ స్థితిలో ఉన్నామని, దీనిపై వారితో కలిసి పని చేసి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read..
Donald Trump | సుంకాల వివాదం వేళ.. ఈ ఏడాది చివర్లో భారత్‌కు ట్రంప్..?
Sergio Gor | భారత్‌ను చైనాకు దూరం చేసి.. యూఎస్‌కు దగ్గర చేసుకోవడమే మా ప్రాధాన్యం : అమెరికా రాయబారి
Jagdeep Dhankhar | ఎట్టకేలకు కనిపించారు.. రాజీనామా తర్వాత తొలిసారి బయటకొచ్చిన ధన్‌ఖడ్