e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News దుబాయ్‌ వ్యాపార బోర్డులో లులు చైర్మన్‌కు చోటు

దుబాయ్‌ వ్యాపార బోర్డులో లులు చైర్మన్‌కు చోటు

దుబాయ్‌ : అబుదాబి ప్రభుత్వ అత్యున్నత సంస్థలో భారతీయ వ్యాపారికి చోటు లభించింది. అబుదాబి వ్యాపార బోర్డు వైస్‌ చైర్మన్‌గా భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త యూసుఫ్ అలీ నియమితులయ్యారు. ఈయన నియామకాన్ని ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ షేక్ ముహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రకటించారు. ఈ సంస్థ యూఏఈలోని అన్ని వ్యాపారాలను పర్యవేక్షిస్తుంది. 29 మంది సభ్యుల బోర్డులో చేరిన ఏకైక భారతీయుడుగా యూసుఫ్‌ అలీ చరిత్ర సృష్టించారు. క్రౌన్ ప్రిన్స్ షేక్ ముహమ్మద్ అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఏడీసీసీఐ) కు కొత్త డైరెక్టర్ల బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదన జారీ చేశారు.

65 ఏండ్ల వయసున్న యూసుఫ్ అలీ.. అబుదాబిలోని లులు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్న యూసుఫ్ అలీ.. కేరళలోని త్రిస్సూర్ జిల్లా నాటికాకు చెందినవారు. ఈయనకు చెందిన సంస్థ అనేక దేశాలలో హైపర్‌మార్కెట్లు, రిటైల్ కంపెనీలను నిర్వహిస్తున్నది. ఏడీసీసీఐ అధ్యక్షుడిగా అబ్దుల్లా ముహమ్మద్ అల్ మజ్రౌయి, యూసుఫ్ అలీని ఉపాధ్యక్షుడిగా క్రౌన్‌ ప్రిన్స్‌ నియమించారు. ఏడీసీసీఐ అబుదాబిలో స్థాపించిన అన్ని వ్యాపారాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ. ఆబుదాబిలో చేపట్టే వ్యాపారాలన్నీ ఏడీసీసీఐ నుంచే లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఈ బోర్డు ఎమిరేట్స్, సీఈఓలో యూసుఫ్ అలీ మాత్రమే భారతీయుడు కావడం విశేషం. తనను ఏడీసీసీఐ ఉపాధ్యక్షుడిగా నియమించడాన్ని తన జీవితంలో గర్వించదగ్గ క్షణం అని యూసుఫ్‌ అలీ అభివర్ణించారు. క్రౌన్ ప్రిన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

ఇటీవల, అబుదాబి క్రౌన్ ప్రిన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్మీ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త యూసుఫ్ అలీతోపాటు మరో 11 మందికి అబుదాబి అత్యున్నత పౌర గౌరవాన్ని ప్రదానం చేశారు. 2018
ఆగస్ట్‌లో కేరళలో వరదలు వచ్చిన సమయంలో అక్కడి ప్రభావిత ప్రాంతాలను ఆదుకునేందుకు యూసుఫ్ అలీ 9.23 మిలియన్ యూఏఈ దిర్హామ్‌లను విరాళంగా ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

మొబైల్ వాడకంలో మనకు మూడో స్థానం

వచ్చే ఏడాది దసరా కల్లా ఎంజే ఫీల్డ్‌ నుంచి రిలయన్స్ గ్యాస్‌ ఉత్పత్తి

కశ్మీర్‌లో రాష్ట్రపతి కోవింద్‌ పర్యటన

ఎల్లుండి భారత్‌లో అమెరికా విదేశాంగ మంత్రి పర్యటన

ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు

3 డీ ప్రింటింగ్‌తో కృత్రిమ చెవులు, ముక్కు సృష్టి

ఐటీసీ ఖర్చులు పెరిగాయ్‌..

‘నేషన్‌ ఫస్ట్‌’ మంత్రంతో ముందుకు : మన్‌ కీ బాత్‌లో మోదీ

చరిత్రలో ఈరోజు.. 43 ఏండ్ల క్రితం టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టి

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement