కశ్మీర్లో రాష్ట్రపతి కోవింద్ పర్యటన
భారతదేశం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆయన నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం శ్రీనగర్ చేరుకున్న రాష్ట్రపతికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీనగర్ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు

శ్రీనగర్ : భారతదేశం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆయన నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం శ్రీనగర్ చేరుకున్న రాష్ట్రపతికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీనగర్ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడే వైమానిక దళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సోమవారం నాడు డ్రాస్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా శ్రీనగర్ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్ భవన్లో బస చేస్తారు. సోమవారం కార్గిల్ విజయ్ దివాస్ 22 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ద్రాస్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించనున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఆయనతో పాటు హాజరుకానున్నారు. ద్రాస్ వార్ మెమోరియల్‌లో నివాళులర్పించిన అనంతరం ఆయన తిరిగి శ్రీనగర్‌కు రానున్నారు. మంగళవారం కశ్మీర్ యూనివర్శిటీ కాన్వొకేషకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా 84 మంది విద్యార్థులకు పతకాలు, డిగ్రీలు పంపిణీ చేయనున్నారు. ఆయనతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కశ్మీర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తలాత్ అహ్మద్ కూడా హాజరుకానున్నారు.
రాష్ట్రపతి బుధవారం తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. జమ్ముకశ్మీర్‌లో ఆయన ఇతర కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. అయితే, శ్రీనగర్‌లోని కొన్ని పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చని వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో శ్రీనగర్‌లోని అన్ని ప్రాంతాల్లో భద్రతను ముమ్మరం చేసినట్లు భద్రతా విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్డీ సింగ్ జామ్వాల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎల్లుండి భారత్‌లో అమెరికా విదేశాంగ మంత్రి పర్యటన
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
3 డీ ప్రింటింగ్‌తో కృత్రిమ చెవులు, ముక్కు సృష్టి
‘నేషన్ ఫస్ట్’ మంత్రంతో ముందుకు : మన్ కీ బాత్‌లో మోదీ
చరిత్రలో ఈరోజు.. 43 ఏండ్ల క్రితం టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

