‘నేషన్ ఫస్ట్’ మంత్రంతో ముందుకు : మన్ కీ బాత్‌లో మోదీ
ఇండియా జోడో ప్రచారాన్ని అమలు చేయాలని, నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్ అనే మంత్రంతో ముందుకు సాగాలని భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

న్యూఢిల్లీ : ఇండియా జోడో ప్రచారాన్ని అమలు చేయాలని, నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్ అనే మంత్రంతో ముందుకు సాగాలని భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ రేడియో కార్యక్రమం 79 వ ఎపిసోడ్. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లను ఉత్సాహపరిచడం గురించి కూడా మోదీ మాట్లాడారు. కార్గిల్ అమరవీరులను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావడంపై ‘నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్’ అనే నినాదాన్ని ఇచ్చారు. క్విట్ ఇండియా ప్రచారం తరహాలో దేశ ప్రజలు ఇండియా జోడో ప్రచారాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఒడిశా, తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా వినూత్నమైన పనులను చేపడుతున్న వారిని మోదీ ప్రశంసించారు. ‘వోకల్ ఫర్ లోకల్ ప్రాధాన్యతనిస్తూ చేనేత, ఖాదీ వస్త్రాలను ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేపు కార్గిల్ విజయ్ దివాస్. ఇది భారత సైన్యం ధైర్యానికి చిహ్నం. కార్గిల్ కథ ప్రజలంతా చదివి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కార్గిల్ హీరోలకు వందనం’ అని మోదీ చెప్పారు.
దేశం శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న 75 సంవత్సరాల స్వేచ్ఛను మనం అనుభవిస్తున్నాం. ఇది మన అదృష్టం. ఈ సందర్భంగా ‘అమృత్ మహోత్సవ్’ బాపు సబర్మతి ఆశ్రమం నుంచి మార్చి 12 న ప్రారంభమైంది. ఇదే రోజున బాపు దండి యాత్రను కూడా పునరుద్ధరించబడింది. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్ నుంచి పుదుచ్చేరి వరకు, గుజరాత్ నుంచి ఈశాన్యం వరకు.. అమృత్ మహోత్సవ్‌కు సంబంధించిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ‘అమృత్ మహోత్సవ్’ రాజకీయ కార్యక్రమం కాదు. దేశ ప్రజలకు చెందినది. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి’ అని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆగస్ట్ 15 న చేపడుతున్న జాతీయ గీత ప్రచారంలో చేరాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ రోజున ఎక్కువ మంది భారతీయులు జాతీయ గీతాన్ని ఆలపించాలన్నారు. దీని కోసం rashtragaan.in ఒక వెబ్సైట్ కూడా సృష్టించబడిందన్నారు. దీని సహాయంతో ఎవరైనా జాతీయ గీతం పాడి రికార్డ్ చేయవచ్చునని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
చరిత్రలో ఈరోజు.. 43 ఏండ్ల క్రితం టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టి
శుభవార్త..! తగ్గనున్న ఐదు మెడికల్ డివైజ్‌ల ధరలు
ఒలింపిక్స్‌లో 25 ఏండ్ల తర్వాత ఇండియా సంచలనం..!
1991 నాటి ఆర్థిక కష్టాలు రానున్నాయి : మన్మోహన్ సింగ్ హెచ్చరిక
సెప్టెంబర్ నుంచి చిన్నారులకు కరోనా టీకాలు : గులేరియా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

