e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home News చరిత్రలో ఈరోజు.. 43 ఏండ్ల క్రితం టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టి

చరిత్రలో ఈరోజు.. 43 ఏండ్ల క్రితం టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టి

ల్యాబ్‌లో తయారైన పిండం నుంచి కొత్త మనిషి పుట్టుక కథ 43 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున మొదలైంది. 1978 జూలై 25 న మాంచెస్టర్‌లోని జిల్లా జనరల్ హాస్పిటల్‌లో వైద్య బృందం తొలి టెస్ట్ ట్యూబ్‌ బేబీని సృష్టించి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. లెస్లీ అనే యువతి ఐవీఎఫ్‌ పద్ధతి ద్వారా ఈ తొలి టెస్ట్ ట్యూబ్ బేబీకి జన్మనిచ్చింది. ఈ చిన్నారి పేరు లూయిస్‌. ఐవీఎఫ్ ద్వారా విజయవంతంగా చిన్నారి జన్మించడంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తల్లిదండ్రులు కావాలనే కలకు కొత్త ఆశను ఇచ్చింది. ప్రతి సంవత్సరం ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పిల్లలు పుడుతున్నారు.

మాంచెస్టర్‌కు చెందిన లెస్లీ, పీటర్ బ్రౌన్ దంపతులకు వివాహమైన అనంతరం చాలా రోజుల వరకు సంతానం కలుగలేదు. లెస్లీకి ఫెలోపియన్ ట్యూబుల్లో కొన్ని సమస్యలు ఉన్న కారణంగా ఆమె తల్లి కాలేదని వైద్యులు చెప్పడంతో లెస్లీ తల్లి కావాలనే ఆశలను వదులుకున్నది. ఇదే సమయంలో పాట్రిక్ అనే వైద్యుడు దశాబ్ద కాలంగా ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా గర్భం గురించి శాస్త్రవేత్త రాబర్ట్ ఎడ్వర్డ్స్ తో కలిసి పనిచేస్తున్నాడు. అప్పటివరకు వీరిద్దరు కలిసి ఐవీఎఫ్ సాంకేతికత ద్వారా 282 మంది మహిళలపై పిల్లలు పుట్టడానికి ప్రయత్నించారు. వీరిలో ఐదుగురు మహిళలు మాత్రమే గర్భం దాల్చారు. అయితే, వివిధ కారణాల వల్ల ఒక్కరు కూడా బిడ్డకు జన్మనివ్వలేదు.

- Advertisement -

1977 నవంబర్ లో ఐవీఎఫ్ సాంకేతిక పరిజ్ఞానం ప్రయోగానికి లెస్లీ, పీటర్‌ దంపతులు ఒప్పుకోవడంతో ప్రయోగం ప్రారంభమైంది. స్పెర్మ్, అండం కలుపడం ద్వారా ప్రయోగశాలలో ఒక పిండాన్ని సృష్టించారు. ఈ పిండాన్ని లెస్లీ గర్భాశయంలో అమర్చారు. మరుసటి ఏడాది జూలై 25 న లెస్లీ ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమెకు వారు లూయీస్‌ అని పేరు పెట్టారు. మరుసటి సంవత్సరం మరో పాపను ఐవీఎఫ్‌ ద్వారా కనేందుకు లెస్లీ, పీటర్‌ ముందుకు వచ్చారు. ఆ పాప పేరు నటాలి. 1999 మే నెలలో నటాలి సాధారణ గర్భం ద్వారా బాబుకు జన్మనిచ్చింది. ఐవీఎఫ్‌ ద్వారా పుట్టి సాధారణ గర్భంతో బాబుకు జన్మనిచ్చిన మహిళగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

2018: పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్

2007: భారతదేశం తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ ఎన్నిక

2001: బందిపోటు రాణిగా పిలుచుకునే ఫూలన్ దేవి కన్నుమూత

2000: పారిస్‌లో ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ కూలిపోయిన ప్రమాదంలో 109 మంది ప్రయాణికులు దుర్మరణం

1984 : అంతరిక్షంలో నడిచిన తొలి మహిళగా చరిత్రలో నిలిచిన సోవియట్‌ రష్యాకు చెందిన స్వెత్లానా సావిట్స్కాయ

1943 : ఇటలీ ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలిగిన డిక్టేటర్ ముస్సోలిని

1837: ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ వాడకం తొలి ప్రదర్శన విజయవంతం

ఇవి కూడా చ‌ద‌వండి..

శుభవార్త..! తగ్గనున్న ఐదు మెడికల్‌ డివైజ్‌ల ధరలు

ఒలింపిక్స్‌లో 25 ఏండ్ల తర్వాత ఇండియా సంచలనం..!

1991 నాటి ఆర్థిక కష్టాలు రానున్నాయి : మన్మోహన్‌ సింగ్‌ హెచ్చరిక

సెప్టెంబర్‌ నుంచి చిన్నారులకు కరోనా టీకాలు : గులేరియా

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana