3 డీ ప్రింటింగ్‌తో కృత్రిమ చెవులు, ముక్కు సృష్టి
3 డీ ప్రింటింగ్ ద్వారా ఇంగ్లండ్‌లోని శాస్త్రవేత్తలు కృత్రిమ చెవులు, ముక్కును సృష్టించారు. పుట్టినప్పటి నుంచి చెవులు లేదా ముక్కు లేని పిల్లలు. పెద్దలలో ఈ అవయవాలను అమర్చే వీలున్నది

లండన్ : 3 డీ ప్రింటింగ్ ద్వారా ఇంగ్లండ్‌లోని శాస్త్రవేత్తలు కృత్రిమ చెవులు, ముక్కును సృష్టించారు. పుట్టినప్పటి నుంచి చెవులు లేదా ముక్కు లేని పిల్లలు. పెద్దలలో ఈ అవయవాలను అమర్చే వీలున్నది. ఈ కృత్రిమ అవయవాలు రోగి కణాల నుంచి తయారు చేస్తారు. ఈ విధానాన్ని వేల్స్‌లోని స్వాన్సీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. చెవులు, ముక్కుతో పాటు ముఖంలోని ఇతర భాగాలను కూడా 3డీ ప్రింటింగ్ ద్వారా తయారు చేసే వీలున్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ విధానంతో కాలిన గాయాలు, క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల ముఖంపై కలిగే నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
పుట్టుకతో చెవి, ముక్కు లేని వారికి సహాయం చేయడానికి స్వాన్సీ విశ్వవిద్యాలయం స్కార్-ఫ్రీ ఫౌండేషన్‌ను ప్రారంభించింది. ముఖంలో కొంత భాగాన్ని కోల్పోయిన క్లినికల్ ట్రయల్స్‌లో ఇటువంటి వ్యక్తులు చేర్చుకుని పరిశోధనలు చేశారు. ప్రస్తుతం వీరు ప్లాస్టిక్ ప్రొస్థెటిక్స్ వాడుతున్నారు. కాని వారు శరీరంలో ఒక భాగంగా అనుభూతి చెందలేరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్కార్-ఫ్రీ ఫౌండేషన్ ఇదే రోగుల నుంచి మూలకణాలను సేకరించి కృత్రిమ ముక్కు, చెవులను అభివృద్ధి చేస్తున్నది.
మృదులాస్థి ఇవ్వాల్సిన అవసరం లేదు..
కృత్రిమ ముక్కు, చెవి తయారీకి స్వాన్సీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రొస్థెసిస్ సిద్ధం చేయడానికి బాధాకరమైన శస్త్రచికిత్స చేయాల్సి ఉంటున్నందున, రోగి శరీరం నుంచి మృదులాస్థి తీసుకోలేదు. అలాకాకుండా, రోగుల నుంచి మూల కణాలు తీసుకుని.. మొక్కల నుంచి పొందిన నానోసెల్లూలోజ్ నుంచి బయోఇంక్ తయారుచేస్తారు. ఈ బయోఇంక్ 3 డీ ప్రింటర్, సాఫ్ట్వేర్ సహాయంతో ప్రొస్థెసిస్ తయారవుతుంది.
బయోఇంక్ ఎంత సురక్షితం..?
ప్రొస్థెసెస్ తయారీకి ఉపయోగించే బయోఇంక్ సురక్షితమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇది విషపూరితం కాదని, వ్యాధులతో పోరాడే రోగనిరోధక శక్తిని ప్రభావితం చేయదని వారు అభయమిస్తున్నారు. ఈ పద్ధతిలో శరీరంలోని ఏ భాగం నుంచి కూడా చర్మం తీసుకోరని, రోగి ఈ బాధాకరమైన ప్రక్రియను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదంటున్నారు నిపుణులు. ప్రొస్థెసెస్ అమర్చడానికి కొత్త పద్ధతి చాలా భిన్నంగా ఉన్నదని ప్రమాదంలో తీవ్రంగా కాలిన గాయాలకు గురైన రిటైర్డ్ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్, ఫౌండేషన్ బ్రాండ్ అంబాసిడర్ సైమన్ వెస్టన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
‘నేషన్ ఫస్ట్’ మంత్రంతో ముందుకు : మన్ కీ బాత్‌లో మోదీ
చరిత్రలో ఈరోజు.. 43 ఏండ్ల క్రితం టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టి
శుభవార్త..! తగ్గనున్న ఐదు మెడికల్ డివైజ్‌ల ధరలు
ఒలింపిక్స్‌లో 25 ఏండ్ల తర్వాత ఇండియా సంచలనం..!
సెప్టెంబర్ నుంచి చిన్నారులకు కరోనా టీకాలు : గులేరియా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

