hawala racket busted | బయటపడిన భారీ డిజిటల్ హవాలా రాకెట్.. 8,000 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
hawala racket busted | జమ్ముకశ్మీర్లో భారీ డిజిటల్ హవాలా రాకెట్ బయటపడింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన 8,000 బ్యాంకు ఖాతాలను దర్యాప్తు సంస్థలు స్తంభింపజేశాయి.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భారీ డిజిటల్ హవాలా రాకెట్ బయటపడింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన 8,000 బ్యాంకు ఖాతాలను దర్యాప్తు సంస్థలు స్తంభింపజేశాయి. (hawala racket busted) జమ్ముకశ్మీర్లో భారీ ‘ములే’ ఖాతాల నెట్వర్క్ ఉన్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. ఈ ఖాతాల్లోకి చేరే డబ్బు చివరికి వేర్పాటువాదం లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో గత మూడ్లేళుగా జమ్ముకశ్మీర్లో సుమారు 8,000కు పైగా ఇలాంటి బ్యాంకు ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు.
కాగా, జమ్ముకశ్మీర్లోకి అక్రమ ఆర్థిక నిధులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి సారించింది. 2017లో ఈ నిధుల ప్రవాహంపై అణిచివేత చర్యలు ప్రారంభించింది. ఆర్థిక మోసాల గొలుసులో సహాయకారిగా వ్యవహరించే మధ్యవర్తులను ‘ములర్లు’ అని పిలుస్తారని గుర్తించింది. ‘డిజిటల్ హవాలా’ వ్యవస్థగా వ్యవహరించే ఈ నెట్వర్క్ వైపు ‘ములర్లు’ మొగ్గు చూపుతున్నారని ఎన్ఐఏ అనుమానించింది.
మరోవైపు దేశానికి ముప్పుగా మారే ‘ములే’ ఖాతాల విస్తరణను అరికట్టడానికి బ్యాంకులతో కలిసి పనిచేయాలని జమ్ముకశ్మీర్ పోలీసులు, ఇతర సంస్థలను జాతీయ దర్యాప్తు సంస్థలు ఆదేశించాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి బ్యాంకు ఖాతాలపై అధికారులు దృష్టి సారించి వాటిని స్తంభింపజేస్తున్నారు.
Also Read:
Man Kills Wife | భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు పట్టించిన కుమారులు
Watch: బాలికను పక్కకు లాక్కెళ్లిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

