Donald Trump | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ చాలా తెలివైన వ్యక్తి అని (very smart man), గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మోదీతో తనకు మంచి స్నేహబంధం ఉందని తెలిపారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాకు మంచి స్నేహితుడు. ఆయన చాలా తెలివైన వ్యక్తి. గ్రేట్ ప్రైమ్ మినిస్టర్. మోదీ ఇటీవలే యూఎస్ పర్యటకు వచ్చారు. మా మధ్య మంచి చర్చలు జరిగాయి. అవి ఇరుదేశాలకు ఉపయోగకరమైనవిగా భావిస్తున్నా. కానీ, ఆ దేశంతో నాకు ఉన్న ఏకైక సమస్య ఒకటే. అది సుంకాలు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధించే దేశాల్లో భారత్ ఒకటి. అయితే, సుంకాలను వారు గణనీయంగా తగ్గిస్తారని నేను నమ్ముతున్నా. ఏప్రిల్ 2న యూఎస్ దిగుమతులపై ఎంత సుంకాలు విధిస్తే.. నేను కూడా వారి నుంచి అంతే వసూలు చేస్తా’ అని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా, భారత్ వాణిజ్య విధానాలను ట్రంప్ పదే పదే విమర్శిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సుంకాల విషయంలో భారత్‌పై గతంలోనూ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పది రోజుల క్రితం బ్రెయిట్‌బార్ట్ న్యూస్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. ‘నాకు భారత్‌తో మంచి సంబంధం ఉంది. కానీ ఏకైక సమస్య ఏంటంటే.. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. భారత్ టారిఫ్‌లను గణనీయంగా తగ్గించే అవకాశం ఉన్నట్లు నేను నమ్ముతున్నాను. కానీ, ఏప్రిల్ 2 నుంచి వారెంత విధిస్తే.. మేమూ అంతే వసూలు చేస్తాం’ అని ట్రంప్ అన్నారు.
Also Read..
King Charles | క్యాన్సర్ చికిత్సతో సైడ్ ఎఫెక్ట్స్.. ఆసుపత్రిలో చేరిన కింగ్ చార్లెస్
Earthquake | మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంప బీభత్సం.. 700 దాటిన మృతుల సంఖ్య