Road Accident | అమెరికా (America)లోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగు వాళ్లు మృతి చెందారు. మృతులు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు (Kondurgu) మండలం టేకులపల్లి (Tekulapalli) గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమార్తె ప్రణీతరెడ్డి (35)కి సిద్దిపేటకు చెందిన రోహిత్ రెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం వారు అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో రోహిత్ రెడ్డి తన తల్లి, భార్య, పిల్లలతో కలిసి ఫ్లోరిడాలో కారులో ప్రయాణిస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రణీతరెడ్డి, ఆమె ఆరేళ్ల కుమారుడు హర్వీన్, అత్త సునీత (56) ప్రాణాలు కోల్పోయారు. రోహిత్‌రెడ్డి, చిన్న కుమారుడు గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంతో టేకులపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read..
Pakistani military | పాక్ సైనిక కాన్వాయ్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి.. వైరలవుతున్న దృశ్యాలు
NASA | మరికొన్ని గంటల్లో భూమ్మీదకు రానున్న సునీతా విలియమ్స్.. టైమ్ ప్రకటించిన నాసా
సుదీక్ష కేసు.. బీచ్‌లో దుస్తులు లభ్యం